
📌 Key Points
- థలపతి విజయ్ సినిమాల నుండి రిటైర్‌మెంట్ ప్రకటించారు.
- మలేషియాలో జన నాయగన్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఈ ప్రకటన చేశారు.
- రాబోయే 30 ఏళ్లు అభిమానులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- విజయ్ ఫ్యాన్స్ ఈ వార్తతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కోలీవుడ్ స్టార్ థలపతి విజయ్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. సినిమాల నుండి రిటైర్ అవుతున్నట్లు మలేషియాలో ప్రకటించారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈ వార్తతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
విజయ్ సంచలన ప్రకటన: సినిమాలకు ఇక సెలవు
Thalapathy Vijay: తమిళ స్టార్ నటుడు విజయ్ తన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ నటుడు సినిమాలకు దూరం అవుతున్నారు అంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయంపై. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన చేశాడు విజయ్. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్(తెలుగులో జన నాయకుడు). ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపధ్యంలోనే తాజాగా మలేషియాలో జన నాయగన్ ఆడియో రిలీజ్ ఈవెన్ నిర్వహించారు మేకర్స్.
ప్రజా సేవ కోసమే రిటైర్‌మెంట్?
‘ఈ సినిమాలో ఇంకో హీరో మా నానమ్మ’.. రాజాసాబ్ లో ప్రభాస్ చెప్పిన ఆ హీరో ఈమే..
జన నాయగన్: విజయ్ చివరి సినిమానా?
ఈవెంట్ లో హీరో విజయ్(Thalapathy Vijay) అభిమానుల సమక్షంలో తన రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా కోసం చాలా మంది ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు. వారికోసం మరో 30 ఏళ్లపాటు నేను నిలబడతా. నా అభిమానులకు సేవ చేసుకోవడం కోసమే సినిమాలకు దూరం అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, సినిమాలకు విజయ్ దూరం అవుతున్నాడు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. దీంతో, విజయ్ ఫ్యాన్స్ ఎమోషనల్ ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో ఇక వెండితెరపై కనిపించడా అంటూ బాధపడుతున్నారు.
సినిమాలకు దూరం అవ్వాలనే విజయ్ నిర్ణయం అభిమానులను నిరాశపరిచింది. ప్రజా సేవలో ఆయనకు మద్దతు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జన నాయగన్ ఆయనకు చివరి చిత్రంగా నిలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.


