|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నడ కంటే హిందీలోనే ఎక్కువే.. కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్.. అయిదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published: 06-10-2025, 9:13 PM
కన్నడ కంటే హిందీలోనే ఎక్కువే.. కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్.. అయిదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.362.75 కోట్లు సాధించి, ముఖ్యంగా హిందీ మార్కెట్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. కన్నడ కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

Key Points

1

కాంతార చాప్టర్ 1 ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.362.75 కోట్లు వసూలు చేసింది.

2

ఇండియాలో నికర వసూళ్లు రూ.256.5 కోట్లు, గ్రాస్ రూ.307 కోట్లు.

4

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బడ్జెట్ రూ.125 కోట్లు.

కాంతార చాప్టర్ 1 ఐదు రోజుల కలెక్షన్లు

2022 కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన కలెక్షన్ల పరుగును కొనసాగిస్తోంది. ఈ శాండల్‌వుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజైన ఈ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు, ఇండియాలో రూ.250 కోట్లు దాటింది.

కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ 1 ఇండియాలో అయిదు రోజుల్లో రూ.256.5 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలకడ ప్రదర్శిస్తోంది. సోమవారం (అక్టోబర్ 6) ఈ మూవీ ఇండియాలో రూ.31.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

హిందీలో భారీ వసూళ్లు, భాషల వారీగా గణాంకాలు

కాంతార చాప్టర్ 1 మూవీకి హిందీలో ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అయిదు రోజుల్లో హిందీలో ఈ సినిమా రూ.82.25 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కన్నడలో రూ.75.85 కోట్లు సొంతం చేసుకుంది. తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ రూ.52.75 కోట్లు, తమిళంలో రూ.24.75 కోట్లు, మలయాళంలో రూ.20.9 కోట్లు దక్కించుకుంది.

కాంతార చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా అయిదు రోజుల్లో రూ.362.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.307 కోట్లు కాగా, ఓవర్సీస్ వాటా రూ.55.75 కోట్లు. వీక్ డేస్ లో కూడా కాంతార చాప్టర్ 1 జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో కన్నడ సినిమాగా నిలిచిన కాంతార 2 మరికొన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది.

కాంతార చాప్టర్ 1 సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది సినిమా రన్ ను మరించ పెంచే అవకాశముంది. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బడ్జెట్ రూ. 125 కోట్లు.

ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాంతార 1 దూకుడు

దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రారంభ రోజున రూ. 61.85 కోట్ల నికర వసూళ్లు చేసింది. 169 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద ఉదయం 41.91% ఆక్యుపెన్సీతో రికార్డు సృష్టించింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ షోలకు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు.

చిత్ర విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఎక్స్ లో కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 3, 4 తేదీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో “కాంతార చాప్టర్ 1 తన ఫస్ట్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. సెలవు తర్వాత పనిదినమైన శుక్రవారం మినహా మిగిలిన మూడు రోజులు గురువారం, శనివారం, ఆదివారం సూపర్ వృద్ధిని చూశాయి. ఇప్పుడు అందరి దృష్టి సోమవారంపై ఉంది.” అని పేర్కొన్నారు.

కాంతార చాప్టర్ 1 చిత్రం వీక్ డేస్‌లోనూ అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. రిషబ్ శెట్టి విజన్, సినిమాకు లభిస్తున్న పాజిటివ్ టాక్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.