
📌 Key Points
- మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాలను సృష్టిస్తాడు.
- తాజాగా శంబాల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆది సాయికుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
- థమన్ ఆది సాయికుమార్‌ను ‘పప్పు’ అని సంబోధించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
- ఆది సాయికుమార్ వ్యక్తిత్వం మంచిదని, వివాదాలకు దూరంగా ఉంటాడని థమన్ వివరించారు.
సంగీత దర్శకుడు థమన్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆది సాయికుమార్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అని సంబోధించి వివాదాస్పదమయ్యారు. శంబాల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
థమన్ సంచలన వ్యాఖ్యలు: వివాదాల చరిత్ర
Thaman:మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ థమన్. అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు విజయపజయాలు పక్కన పెడితే వరుస సినిమాలతో థమన్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే థమన్ గెస్ట్ గా వచ్చిన ఏ సినిమా ఫంక్షన్ లో నైనా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా ఉండలేడు అంటే ఆశ్చర్యం లేదు. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది అయినా.. హీరోల గురించి అయినా ఏదో ఒకటి అనేస్తాడు. అయితే అది తన మనసులో నుంచి వచ్చిన భావాలే అయినా కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో వివాదాలకు దారితీస్తూ ఉంటాయి.
మొన్నటికి మొన్న అఖండ 2 తాండవం సక్సెస్ మీట్ లో ఇండస్ట్రీలో యూనిటీ లేదని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఇలా ఒక సినిమాకు ఒకలాగా మరో సినిమాకు మరోలాగా సెలబ్రిటీలు ఉంటుంటే తనకు చాలా బాధగా ఉందని చెప్పి హైలెట్ అయ్యాడు. థమన్ చెప్పిన విషయం నిజమే అయినా కూడా కాకపోతే అలా డైరెక్ట్ గా చెప్పడం పద్ధతి కాదని కొందరు భావించారు. ఇక తాజాగా మరోసారి థమన్ తన మనసులోని భావాలను బయటపెట్టి హీరో ఆది సాయికుమార్ ను కించపరచినట్లు మాట్లాడాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఆది సాయికుమార్‌పై ‘పప్పు’ వ్యాఖ్యలు: వైరల్ అవుతున్న వీడియో
ఆది సాయికుమార్ నటిస్తున్న శంబాల సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు థమన్ గెస్ట్ గా విచ్చేశాడు. ఇక ఈవెంట్లో థమన్.. ఆది సాయికుమార్ గురించి మంచిగానే చెప్పుకొచ్చాడు. కానీ ఒక హీరోను అందరి ముందు స్టేజి మీద పప్పుతో పోల్చడం కొద్దిగా అవమానించినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. “ఆది ఎంత మంచి మనిషి అంటే ఎక్కువ తక్కువ మాట్లాడడు. ఇంకా మేము కలపాలి ఆవకాయ. అతను ఒక పప్పు లాంటి మనిషి.. అన్నిట్లో కలుస్తాడు. పప్పులో కలుస్తాడు.. సాంబార్లో కలుస్తాడు.. అన్నిట్లో కలుస్తాడు.. ఇక నెయ్యి వేసుకొని తినడమే” అంటూ చెప్పుకొచ్చాడు.
శంబాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థమన్ మాటలు
థమన్ చెప్పిన దాంట్లో కచ్చితంగా నిజం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆది ఇండస్ట్రీకి వచ్చిన దగ్గరనుంచి ఎలాంటి వివాదాలలో ఇరుక్కోలేదు. ఆచితూచి మాట్లాడడం.. అవసరమైతే కెమెరా ముందుకు రావడం.. లేకపోతే ఇంట్లోనే ఉండడం తప్ప ఎప్పుడూ బయట కూడా కనిపించిన దాఖలాలు లేవు. కచ్చితంగా ఆది చాలా మంచి వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అతను పోల్చిన విధానమే బాలేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో కానీ, రాజకీయపరంగా కానీ నెగిటివ్ పదంగా మార్చేశారు. పప్పు అంటే ఏమీ తెలియని వాడని, సుద్ద పప్పు కింద జమ కట్టడం అని అంటారని పెద్దలు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆదిని కూడా తమ పప్పు అంటే అతనికి అది ఒక ట్యాగ్ లైన్ గా మారిపోతుందని.. ఇకనుంచి అందరూ ఆది పెద్ద పప్పు అనే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావ్.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
థమన్ ఉద్దేశ్యం మంచిదే అయినా, ‘పప్పు’ వంటి పోలికలు వివాదాలకు దారితీశాయి. ఇది థమన్ మాటతీరును, అతని చుట్టూ అలుముకున్న వివాదాలను మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


