|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమ్మారెడ్డి బాంబ్: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజమే! చిరు వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్!

Published: 30-01-2026, 12:05 PM
తమ్మారెడ్డి బాంబ్: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజమే! చిరు వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్!
  • సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తమ్మారెడ్డి భరద్వాజ్ స్పష్టం చేశారు.
  • చిరంజీవి ఇండస్ట్రీలో వేధింపులు లేవని చెప్పడంపై చిన్మయి తప్పుబట్టారు.
  • ఒకప్పుడు రాజులు మహిళల కోసమే సినిమాలు తీసేవారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
  • ప్రతి సంవత్సరం కొన్ని వందల సినిమాల్లో కొందరు మహిళలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమలో అలాంటి సమస్యలు లేవని చెప్పడంపై ఆయన స్పందించారు. చిన్మయి వాదనతో ఆయన ఏకీభవించారు.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న తమ్మారెడ్డి

Thammareddy: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే తప్పనిసరిగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఎంతో మంది సెలెబ్రిటీలు ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందుల గురించి బయట పెట్టారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ బాధితులు కూడా ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో అలాంటి ఇబ్బందులు ఏవి లేవని ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని మనం ఎలా వ్యవహరిస్తే అలాగే ఉంటుందంటూ ఈయన మాట్లాడారు.

మనం ఇండస్ట్రీలో సరైన విధంగా ఉంటే మన పట్ల కూడా ఇతరులు అలాగే ఉంటారు. ఎవరి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు రావనే ఉద్దేశంతో చిరంజీవి మాట్లాడారు. అయితే ఈ విషయంపై చిన్మయి (Chinmayi)వంటి తదితరులు కూడా స్పందిస్తూ చిరంజీవి వ్యాఖ్యలు నిజం కాదని ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు . అయితే తాజాగా ఈ విషయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Thamma Reddy bhardwaj)స్పందించారు. ఈ సందర్భంగా ఈయన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరు చెప్పింది. చిన్మయి చెప్పింది నిజమే.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  ఉందని తెలిపారు. ఒకప్పుడు రాజులు జమీందారులు మహిళల కోసమే సినిమాలు చేసేవారని, కాలక్రమమైన పరిస్థితులు దిగజారిపోయాయని తమ్మారెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో అందరూ ఒకే విధంగా ఉంటారని చెప్పడం సరికాదని తెలిపారు.

చిరంజీవి వ్యాఖ్యలను ఖండించిన తమ్మారెడ్డి భరద్వాజ్

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బాంబు పేల్చారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని, అవి వంద శాతం ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు రాజులు, జమీందారులు మహిళల కోసమే సినిమాలు తీసేవారని, కాలక్రమేణా పరిస్థితులు దిగజారాయని ఆవేదన… pic.twitter.com/rnrFn5kdML

— ChotaNews App (@ChotaNewsApp) January 30, 2026

మహిళల కోసమే సినిమాలు తీసేవారు: తమ్మారెడ్డి ఆవేదన

ఒక ఏడాదిలో కొన్ని వందల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో పదుల సంఖ్యలో మహిళలు మాత్రమే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇది వ్యవస్థ లోపం కాదని కొంతమంది వికృత చేష్టల ఫలితమని ఈయన పేర్కొన్నారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్  గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ.. చిన్మయి చెప్పింది నిజమేనని అంగీకరించారు. కొంతమంది సినీ పెద్దలు లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని ఈయన చిన్మయికి మద్దతు తెలుపుతూనే మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్  పై  తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మరి తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర సెలబ్రిటీల స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక తమ్మారెడ్డి గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే వాదన మరోసారి తెరపైకి రావడంతో, దీనిపై చర్చ జరుగుతోంది. తమ్మారెడ్డి వ్యాఖ్యలు పరిశ్రమలో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.