|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thammudu: రేపే సినిమా రిలీజ్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ‘తమ్ముడు’ టీమ్

Published: 03-07-2025, 12:05 PM
Thammudu: రేపే సినిమా రిలీజ్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ‘తమ్ముడు’ టీమ్

నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అయితే, సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి చిత్ర బృందం హెచ్చరిక జారీ చేసింది.

Key Points

1

నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదలవుతోంది.

2

సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి చిత్ర బృందం హెచ్చరిక జారీ చేసింది.

4

బాధ్యతాయుతమైన విమర్శలకు సిద్ధంగా ఉన్నామని చిత్ర బృందం పేర్కొంది.

‘తమ్ముడు’ రిలీజ్‌కు సిద్ధం

హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈమూవీ జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థ్రియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు చిత్ర బృందం.

ఈ క్రమంలోనే సినిమాను టార్గెట్ చేస్తూ.. మూవీ ఎలా ఉన్నా కూడా నెటిగివ్‌గా ట్రోల్స్ చేస్తూ, సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ మేరకు ‘తమ్ముడు’ సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అగౌరవపరిచే రివ్యూస్ ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిర్మాతలు హెచ్చరించారు. అయితే.. వారు బాధ్యతాయుతమైన విమర్శలకు సిద్ధంగా ఉన్నారు.. కానీ సినిమాను కావాలని దెబ్బతీసే లక్ష్యంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తే మాత్రం సీరియస్ పరిణామాలు ఉంటాయని తెలిపారు మూవీ టీమ్. Link

నెగిటివ్ రివ్యూలకు హెచ్చరిక

చట్టపరమైన చర్యల హెచ్చరిక

చివరగా, ‘తమ్ముడు’ చిత్ర బృందం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ, బాధ్యతాయుతమైన విమర్శలను స్వాగతిస్తూ, నెగిటివ్ ప్రచారం చేసే వారికి హెచ్చరిక జారీ చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.