|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thammudu OTT: నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ ఫిక్స్… 30 రోజుల్లోపే !

Published: 16-07-2025, 8:57 AM
Thammudu OTT: నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ ఫిక్స్... 30 రోజుల్లోపే !

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడకపోవడంతో, ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా…

Key Points

1

నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

2

సినిమా రిలీజ్ అయిన 30 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం.

4

థియేటర్లలో చూడలేని వారికి ఓటీటీలో చూసే అవకాశం.

తమ్ముడు సినిమా ఓటీటీ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ (Nithin) గురించి తెలియని వారు ఉండరు. 20 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో…. సినిమాలు తీసుకుంటూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు నితిన్. అయితే అలాంటి నితిన్ తాజాగా తమ్ముడు (Thammudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొన్న జూలై 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

30 రోజుల్లోనే ఓటీటీ ప్రయాణం

హీరో నితిన్ చేసిన తమ్ముడు సినిమాను వేణు శ్రీరామ్ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ మూవీలో.. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇందులో ఒకరు వర్ష బొల్లమ్మ కాగా మరొకరు సప్తమి గౌడ. పవన్ కళ్యాణ్ గతంలో తీసిన సినిమా టైటిల్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయినప్పటికీ బాక్సాఫీస్ ముందు పెద్దగా ఆడలేదు తమ్ముడు సినిమా. దీంతో హీరో నితిన్ మరోసారి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.

నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు

అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు… ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన 30 రోజులలో లోపే… ఓటీటీలోకి (Thammudu OTT) వస్తోందని అంటున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందట. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం అందుకుంది. కాగా దిల్ రాజు- శిరీష్ నిర్మాతలుగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

చివరగా, నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం సంతోషించదగిన విషయం. థియేటర్లలో చూడలేని వారికి ఇది మంచి అవకాశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.