
ఓటీటీలో తమిళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ‘హౌస్ మేట్స్’ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఐదు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొత్తగా పెళ్ళైన జంట ఎదుర్కొన్న దెయ్యాల తంత్రాల కథ ఇది.
Key Points
కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో దెయ్యాల సమస్యను ఎదుర్కొంటారు.
జీ5 ఓటీటీలో 'హౌస్ మేట్స్' సినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటింది.
హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఆకర్షిస్తోంది.
దర్శన్, ఆర్ష చాందిని ప్రధాన పాత్రధారులు.
‘హౌస్ మేట్స్’ ఓటీటీలో విజయం
ఓటీటీలో ఓ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ అదరగొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయిదు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఆ సినిమానే తమిళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ‘హౌస్ మేట్స్’. ఇది సెప్టెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ సూపర్ హిట్ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ‘హౌస్ మేట్స్’ ఓటీటీలో సత్తాచాటుతోంది. జీ5 ఓటీటీ లోకి సెప్టెంబర్ 19న ఈ మూవీ అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన జోరు చూపిస్తుంది. ఇప్పుడు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. అయిదు రోజుల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకుంది.
‘‘హౌస్ మేట్స్ 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగి మినిట్స్ ను క్రాస్ అయింది. డబుల్ డ్రామా, డబుల్ లవ్. బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హౌస్ మేట్స్ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది’’ అని జీ5 తమిళ్ ఎక్స్ లో పోస్టు చేసింది.
కథానాయికలు, దెయ్యాల మిస్టరీ
హౌస్ మేట్స్ మూవీ ఆగస్టు 1, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ టి.రాజా వేల్. ఈ సినిమాలో దర్శన్, ఆర్ష చాందిని, కాళీ వెంకట్, వినోదిని తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ప్లేస్మిత్ స్టూడియోస్, సౌత్ స్టూడియోస్, ఎస్కే ప్రొడక్షన్ పై విజయప్రకాష్, ఎస్పీ శక్తివేల్ నిర్మించారు. తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ సమర్పించాడు. ఈ సినిమాకు థియటర్లో పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ చేయలేకపోయింది.
హౌస్ మేట్స్ ఓ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ . కార్తీక్, అనుకు కొత్తగా పెళ్లి అవుతుంది. వీళ్లు ఎంతో కష్టపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కు షిప్ట్ అవుతారు. హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ గడపాలని కోరుకుంటారు. కానీ అక్కడ కొన్ని సంఘటనలు పారా నార్మల్ గా జరుగుతాయి. దీంతో భయపడతారు.
సినిమా విశేషాలు
అప్పుడే వాళ్లకు ఓ నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనే వాస్తవం తెలుస్తుంది. 2012లో అదే ఫ్లాట్ లో నివసించిన రమేష్, విజీ దంపతులు, తమ కొడుకుతో అక్కడే ఉంటున్నారని మిస్టరీ రివీల్ అవుతుంది. అయితే వాళ్లు చనిపోయి దెయ్యాలుగా మారతారన్నదే ట్విస్ట్.
కార్తీక్, అనుకు కనిపించకుండా రమేష్ ఫ్యామిలీ అదే ఇంట్లో ఉంటుంది. మరి తర్వాత ఏం జరిగింది? అదే ఫ్లాట్ లో దెయ్యాలు ఉండటానికి కారణం ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
జీ5 ఓటీటీలో ‘హౌస్ మేట్స్’ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అనేది దాని విజయానికి నిదర్శనం. హారర్, కామెడీ, మిస్టరీ మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకుంది.


