|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?

Published: 10-12-2025, 5:08 AM
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?
  • బిగ్ బాస్ తెలుగు 9 షోలో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు.
  • తాజా ప్రోమోలో భరణి.. తనూజ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు.
  • టైటిల్ గెలిచేందుకు తనూజ కళ్యాణ్ పడాల సాఫ్ట్ కార్నర్‌ని వాడుకుంటోందని ఆరోపణలు.
  • తనూజ కమాండ్‌లకు కళ్యాణ్ పడాల లోబడి ఉన్నాడని భరణి వెల్లడించారు.

బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశకు చేరుకుంది. టైటిల్ రేసు ఉత్కంఠగా మారిన ఈ సమయంలో, తనూజ అసలు రూపం బయటపడింది. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచేందుకు ఆమె కళ్యాణ్ పడాలపై తనకున్న ప్రభావాన్ని ఉపయోగిస్తోందని భరణి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇంటిలో పెద్ద చర్చకు దారితీసింది.

బిగ్ బాస్ తుది దశకు చేరుకుంది

బిగ్ బాస్ తెలుగు 9 షోలో ఇక మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో ఈ ఏడుగురు టాప్ లో చోటు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆల్రెడీ కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే సాధించాడు. కాబట్టి మిగిలిన ఆరుగురు సభ్యుల మధ్య తీవ్ర పోటీ ఉంది. తనూజ, ఇమ్మాన్యుయేల్ ఎలాగూ టాప్ 5 లో ఉంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. సో కళ్యాణ్, ఇమ్ము, తనూజ టాప్ 5లో తప్పనిసరిగా ఉంటారు.

ఇక మిగిలింది సంజన, భరణి, పవన్, సుమన్. వీరిలో భరణికి బిగ్ బాస్ అండదండలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగబాబు శిష్యుడు కావడంతో భరణి మేనేజ్మెంట్ కోటా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  తిరిగి తీసుకువచ్చినందుకు భరణి బాగానే కష్టపడుతున్నాడు. పవన్ కూడా ముందు నుంచి పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి వీరిద్దరూ టాప్ 5 లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.

తనూజ అసలు స్వరూపం బయటపెట్టిన భరణి

ఇక సుమన్ శెట్టికి కూడా బిగ్ బాస్ అండదండలు ఉన్నాయనే టాక్ ఉంది. ఎన్ని అండదండలు ఉన్నా అతడిని టాప్ 5లోకి తీసుకువెళ్లడం సాధ్యం కాదు. సుమన్ శెట్టితో పోల్చుకుంటే సంజన గేమ్ స్ట్రాటజీ పరంగా చాలా బెటర్. అయితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాకతప్పదు అనే ప్రచారం జరుగుతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన, సుమన్ ఇద్దరూ బయటకి వచ్చేస్తారు. మరోవైపు టాప్ 5 కాదు టాప్ 6 అనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే కనుక నిజమైతే సంజనకి టాప్ 6 లో ఛాన్స్ దక్కవచ్చు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు ప్రధానంగా వినిపిస్తున్న సమాధానం తనూజ, కళ్యాణ్ పడాలలలో ఒకరు అని. దీనితో ఎవరికి వారు కొత్త స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో భరణి.. తనూజ అసలు స్వరూపం బయట పెట్టాడు. గ్రాండ్ ఫినాలే సమీపిస్తున్న తరుణంలో ఎలాగైనా టైటిల్ గెలవాలని తనూజ డిసైడ్ అయినట్లు ఉంది. అందుకే ఆమె సరికొత్త స్ట్రాటజీ బయటకి తీసింది.

టైటిల్ కోసం తనూజ కొత్త స్ట్రాటజీ?

కళ్యాణ్ కి ముందు నుంచి తనూజపై సాఫ్ట్ కార్నర్ ఉంది. భరణి మాటలని బట్టి చూస్తే.. తనపై కళ్యాణ్ కి ఉన్న సాఫ్ట్ కార్నర్ ని టైటిల్ గెలిచేందుకు వాడుకుంటోంది అని అర్థం అవుతోంది. భరణి మాట్లాడుతూ.. కళ్యాణ్ తనూజకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. లేవమంటే లేస్తున్నాడు. తనూజ బాగా కమాండ్ చేస్తోంది అని భరణి అన్నారు. మరి తనూజ స్ట్రాటజీలో కళ్యాణ్ చిత్తవుతాడో.. పోటీ ఇస్తాడో వేచి చూడాలి.

బిగ్ బాస్ టైటిల్ కోసం తనూజ ఆడుతున్న గేమ్ స్ట్రాటజీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్‌ని తన నియంత్రణలోకి తీసుకుని టైటిల్ గెలవాలని చూస్తున్న తనూజ ప్రయాణం ఎలా మారుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.