
📌 Key Points
- తరుణ్ భాస్కర్ ఎయిర్ పోర్ట్ హంగామా: గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్ స్టంట్ అని తేలింది!
- దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ప్లాన్: ఫ్లైట్ మిస్ అయినట్టు నటించి ప్రేక్షకులను షాక్ కి గురి చేశారు.
- గాయపడ్డ సింహం టీజర్ విడుదల: అమెరికా వెళ్లాలనే కోరికతో హీరో ప్రయాణం.
- సినిమా ప్రమోషన్స్ కోసం తరుణ్ భాస్కర్ చేసిన ఈ ప్రాంక్ ఇప్పుడు హాట్ టాపిక్!
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా మారి చేసిన హంగామా మాములుగా లేదు. ఆయన ఎయిర్ పోర్ట్ లో చేసిన రచ్చ వెనుక అసలు సీక్రెట్ బయటపడింది. గాయపడ్డ సింహం సినిమా కోసం ఆయన చేసిన ప్లాన్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఎయిర్ పోర్ట్ లో తరుణ్ భాస్కర్ హంగామా వెనుక సీక్రెట్ ఇదేనా?
Tharun Bhascker : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ లో ఓ కెమెరా మెన్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో బాగా వైరల్ అయింది. తనకు ఎయిర్ పోర్ట్ ఎంట్రీ దగ్గర ఏదో ఇబ్బందులు వచ్చినట్టు, ఫ్లైట్ మిస్ అయినట్టు వార్తలు వచ్చాయి. తరుణ్ భాస్కర్ చాలా చిరాగ్గా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఓ కెమెరా మెన్ మీద ఫైర్ అవ్వడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.(Tharun Bhascker)
నేడు ఆ సంఘటన గురించి తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియో గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ లో భాగమే అని తెలిపాడు. తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న గాయపడ్డ సింహం సినిమా టీజర్ నేడు రిలీజయింది. అమెరికాకు వెళ్లాలనే కోరికతో హీరో ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేదే కథ అని టీజర్ బట్టి తెలుస్తుంది.
గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్స్ లో ఇంత రిస్క్ ఉందా?
దానికి తగ్గట్టే దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ప్రమోషన్ చేద్దాం అని చెప్పి అలా ఫ్లైట్ మిస్ అయినట్టు, తరుణ్ భాస్కర్ చిరాకు పడినట్టు చేయించాడట. దీంతో అదంతా సినిమా ప్రమోషన్ కోసం అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. పలువురు మాత్రం ఇది ఏదో ప్రమోషన్ లా ఉందని అప్పుడే కామెంట్స్ చేసారు. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ కొత్తగా ట్రై చేస్తూ ఇలా ప్రేక్షకులను ప్రాంక్ చేస్తున్నారు.
టీజర్ రిలీజ్: అమెరికా డ్రీమ్స్ తో హీరో జర్నీ!
తరుణ్ భాస్కర్ ఎయిర్ పోర్ట్ లో ఫైర్ అయిన వీడియో ఇదే..
తరుణ్ భాస్కర్ సినిమా ప్రమోషన్ స్టంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గాయపడ్డ సింహం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


