|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మిక పెళ్లిపై తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు! ఆహ్వానం అందితే..?

Published: 09-02-2026, 8:05 AM
విజయ్, రష్మిక పెళ్లిపై తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు! ఆహ్వానం అందితే..?
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్.
  • విజయ్, రష్మికల పెళ్లి వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
  • ఫిబ్రవరి 26న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
  • విజయ్, రష్మిక మాత్రం పెళ్లిపై ఎక్కడ స్పందించలేదు.

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇంకా ఆహ్వానం అందలేదని, ఒకవేళ వస్తే అందరికీ తెలియజేస్తానని అన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్, రష్మిక పెళ్లిపై తరుణ్ భాస్కర్ కామెంట్స్

Tharun Bhascker: టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)దర్శకుడిగా పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇటీవల హీరోగా మారి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈయన ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే గాయపడ్డ సింహం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా వారితో ముచ్చటించారు.

ఇలా మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్స్ సినిమా గురించి అలాగే నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు వేశారు అయితే ఒక రిపోర్టర్ మాత్రం తరుణ్ భాస్కర్ ను ప్రశ్నిస్తూ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika) పెళ్లికి వెళ్తున్నారా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు తరుణ్ భాస్కర్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి నాకు ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వలేదని ఒకవేళ ఇన్విటేషన్ ఇస్తే మీకు వాట్సప్ చేస్తాను ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్దాం అంటూ తనదైన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెళ్లి గురించి తరుణ్ భాస్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా విజయ్, రష్మిక పెళ్లి

విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ పెళ్లి తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం బయట పెట్టకపోవడంతో వీరి పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్టు వీరి టీం అధికారకంగా చెప్పారు కానీ రష్మిక విజయ్ దేవరకొండ మాత్రం ఎక్కడ వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.

ఇక ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే వీరి పెళ్లికి ఉదయపూర్ ప్యాలెస్ ముస్తాబవుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ విధంగా వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్న విజయ్ రష్మిక మాత్రం పెళ్లిపై ఎక్కడ స్పందించలేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగా వీరిద్దరూ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరి 26న పెళ్లి అంటూ వైరల్ అవుతున్న వార్తలు

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించి వస్తున్న వార్తలపై వారి స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 26న పెళ్లి జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.