|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The 100 Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న పోలీస్ థ్రిల్లర్.. టాప్-3లో ట్రెండింగ్!

Published: 02-09-2025, 11:46 AM
The 100 Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న పోలీస్ థ్రిల్లర్.. టాప్-3లో ట్రెండింగ్!

జూలై లో విడుదలైన ది 100 సినిమా ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆర్.కె. సాగర్, మిషా నారంగ్ నటించిన ఈ పోలీస్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Key Points

1

ది 100 సినిమా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

2

ఇండియా వ్యాప్తంగా టాప్-3 ట్రెండింగ్ చిత్రాలలో ది 100 చిత్రం ఒకటి.

4

ఆర్.కె. సాగర్, మిషా నారంగ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఓటీటీలో విజయం సాధించిన ది 100

కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్‌. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్‌ ఉంటోంది. ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు డిజిటల్‌గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్‌కే సాగర్, మిషా నారంగ్‌ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్ ‌ థ్రిల్లర్ ‌ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.

టాప్ 3 ట్రెండింగ్ చిత్రాలలో చోటు

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది . అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది . థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది . ఇండియా వ్యాప్తంగా టాప్ -3 లో ట్రెండింగ్ ‌ లోకి వచ్చేసింది . ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది . కాగా .. ఈ చిత్రంలో ఆర్కే సాగర్‌ ఐపీఎల్‌ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.

బహుభాషా విడుదల

ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు . మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్‌లో భారతదేశంలో టాప్ – 3లో ట్రెండింగ్‌ అవుతోంది . మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు . మీ ప్రేమ , ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు .

అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ది 100 సినిమా టాప్ 3 ట్రెండింగ్‌లో నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విజయానికి ప్రేక్షకుల మద్దతు కారణమని దర్శకుడు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.