|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు.. మహిళలకు బాగా కనెక్ట్ అవడం సంతోషం.. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కామెంట్స్

Published: 19-07-2025, 10:10 PM
కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు.. మహిళలకు బాగా కనెక్ట్ అవడం సంతోషం.. డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కామెంట్స్

ఆర్కే సాగర్ హీరోగా నటించిన ‘ది 100’ సినిమా విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాపై దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Key Points

1

ది 100 సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు, భావోద్వేగంతో కూడిన కథ.

2

మహిళా ప్రేక్షకులు సినిమాలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారని దర్శకుడు తెలిపారు.

4

ప్రముఖుల నుండి సినిమాకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి.

ది 100 సినిమా విజయం

మొగలి రేకులు సీరియల్‌తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆర్కే సాగర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఓ బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాగా ది 100 సినిమాను తెరకెక్కించి తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్.

జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ ది 100 మూవీకి వస్తున్న ఆదరణపై డైరెక్టర్ రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.

ప్రేక్షకుల స్పందన

ది 100 డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కేవలం పోలీస్ కథ మాత్రమే కాదు. భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథ. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారి బాధ్యత, బాధ, న్యాయం కోసం పోరాటం చేసే విధానాన్ని చూపించాం” అని అన్నారు.

“థియేటర్లలో సినిమాను చూసి, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు, మాకు సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు బాగా కనెక్ట్ అవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆర్కే సాగర్ పోషించిన ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్‌ క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్ వస్తుంది. మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది” అని దర్శకుడు రాఘవ్ ఓంకార్ తెలిపారు.

దర్శకుడి అభిప్రాయాలు

“ఈ చిత్రానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, నాగబాబు గారు, అంజనా దేవి గారు, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది” అని డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ పేర్కొన్నారు.

“నా తొలి చిత్రానికి ఇంత ప్రోత్సాహం వచ్చినందుకు కృతజ్ఞుడిని. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్‌కే సాగర్‌లకు ధన్యవాదాలు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులకు ముందుకు రావాలనుకుంటున్నాను” అని శశిధర్‌ వెల్లడించారు.

తన తొలి చిత్రానికి లభించిన విజయంపై దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ఆశించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.