|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

THE BLACK GOLD: నెవ్వర్ బిఫోర్ పాత్రలో సంయుక్త – ఫస్ట్ లుక్ అదిరిందిగా!

Published: 20-10-2025, 2:47 AM
THE BLACK GOLD: నెవ్వర్ బిఫోర్ పాత్రలో సంయుక్త - ఫస్ట్ లుక్ అదిరిందిగా!

సౌత్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సంయుక్త నెవ్వర్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టింది. ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.

Key Points

1

సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలో 'ది బ్లాక్ గోల్డ్' చిత్రం తెరకెక్కుతోంది.

2

లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం.

4

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల.

‘ది బ్లాక్ గోల్డ్’ విశేషాలు

సౌత్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తున్న తాజా చిత్రం ది బ్లాక్ గోల్డ్. ఆదివారం సినిమా టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాస్య మూవీస్, మాగంటి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా యోగేష్ కేఎంసీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అంతే కాకుండా దీనిని ఈ పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

ఇక‌ దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని చిత్ర‌యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. పోస్టర్‌లో సంయుక్త రగ్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అంతేకాకుంబా అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది వరకు గ్లామర్‌తో మెప్పించిన మలయాళ బ్యూటీ ఈ సారి యాక్షన్ తో అదరగొట్టబోతుందని అర్థం అర్థం అవుతోంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుండగా విడుదల తరవాత ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంయుక్త పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో

పాన్ ఇండియా లెవెల్‌లో చిత్ర నిర్మాణం

ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రం, విడుదలయ్యాక ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. సంయుక్త నటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.