|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్షమాపణలు కోరుతూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ డైరెక్టర్ ట్వీట్.. కారణం ఏంటంటే?

Published: 08-11-2025, 4:47 AM
క్షమాపణలు కోరుతూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ డైరెక్టర్ ట్వీట్.. కారణం ఏంటంటే?

రష్మిక, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం మంచి విజయం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన సోషల్ మీడియా టైమ్‌లైన్‌లో సినిమా గురించిన ట్వీట్‌లతో నిండినందుకు క్షమాపణలు కోరారు. ఆయన నిజాయితీ, ఆలోచన తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Key Points

1

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

2

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ టైమ్‌లైన్‌లో సినిమా ట్వీట్లతో నిండిపోతున్నందుకు క్షమాపణలు కోరారు.

4

ఆయన ఆలోచన తీరుపై కొందరు నెటిజన్లు షాక్ అవ్వగా, మరికొందరు ఫిదా అవుతున్నారు.

‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్

రష్మిక మందన్న(Rashmika Mandanna),దీక్షిత్ శెట్టి (Dixit Shetty)జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొంతమందిని కన్నీరు పెట్టేలా చేస్తూ.. ప్రశంసలు పొందుతోంది. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, రాహుల్ రవీంద్రన్ క్షమాపణలు చెప్తూ ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘దయచేసి అందరూ నన్ను క్షమించండి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేసిన కారణం

ఎవరైతే సినిమాలో తమకు నచ్చిన అంశాల గురించి చెబుతూ పోస్ట్ పెడుతున్నారో వారందరికీ నేను రియాక్ట్ అవుతున్నాను. ఈ వరుస ట్వీట్స్ వల్ల నా టైమ్ లైన్ మొత్తం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిండిపోతుంది. ఇలా వరుసగా సినిమాకు సంబంధించిన వార్తలు పంచుకోవడం వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో మౌత్ టాక్‌తోనే చాలా చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.

నెటిజన్ల రియాక్షన్ ఏంటి?

ఇక అందుకే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ బాగుందని ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్స్ షేర్ చేస్తుంటే ఇది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా నేను ఇలా ప్రతి ట్వీట్‌కి రిప్లై ఇస్తున్నాను. అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి వారికి నా తరుపున క్షమాపణలు తెలిజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఆయన ఆలోచనా తీరుకు నెటిజన్లు ఇలా కూడా ఉంటారా? అని షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం ఫిదా అవుతున్నారు.

రాహుల్ రవీంద్రన్ ఇలా క్షమాపణలు కోరడం సినిమా పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను, నిజాయితీని చాటుతుంది. నెటిజన్లు ఆయన వినూత్నమైన ఆలోచనకు ఫిదా అవుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.