|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Trailer: ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ట్రైలర్ రిలీజ్

Published: 29-10-2025, 12:47 PM
Trailer: 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ట్రైలర్ రిలీజ్

మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించిన ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

2

మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా, టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.

4

నవంబర్ 7న రష్మిక, సుధీర్ బాబు చిత్రాలతోపాటు ఈ సినిమా రిలీజ్ కానుంది.

‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీమ్, రిలీజ్ డేట్

ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.

ట్రైలర్ రివ్యూ: కథాంశం, కామెడీ హైలైట్స్

ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?

నవంబర్ 7న బాక్సాఫీస్ వద్ద పోటీ

నవంబర్ 7న రష్మిక ‘ద గర్ల్ ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధర’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ ‘ఆర్యన్’ కూడా తెలుగులో విడుదల కానుంది.

ట్రైలర్ చూస్తే నవ్వులు గ్యారెంటీ అనిపిస్తోంది. నవంబర్ 7న ఇతర పెద్ద సినిమాలతో పోటీపడుతున్న ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి. సినిమా పూర్తిస్థాయిలో అలరిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.