|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ది పారడైజ్’ ఊచకోత: ‘ఆయా షేర్’ హిందీ వెర్షన్ విడుదల! స్టెప్పులతో అదరగొట్టిన నాని!

Published: 03-03-2026, 6:35 PM
  • నాని హీరోగా ‘ది పారడైజ్’ చిత్రం ఆగష్టు 21న విడుదల కానుంది.
  • ‘ఆయా షేర్’ పాటను అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
  • ఈ పాట తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది.
  • హిందీ వెర్షన్‌కు కూడా తెలుగులో వచ్చినంత ఆదరణ లభిస్తోంది.

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది పారడైజ్’. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాట ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యొక్క హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు.

‘ది పారడైజ్’ నుండి ‘ఆయా షేర్’ విడుదల

The Paradise: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) వరల్డ్ వైడ్ సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఆల్రెడీ ‘కన్మణి రాంబో ఖతీజా’ మూవీకి చెందిన ‘డిప్పమ్ డప్పడ్’ ట్యూన్‌నే యాజీటీజ్‌గా దింపేసినా, పవర్ ఫుల్ లిరిక్స్, నాని స్టన్నింగ్స్ ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టేశాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన హిందీ వెర్షన్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

హిందీలోనూ అదరగొడుతున్న నాని పాట

ఈ సినిమాను ఆగస్టు 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అధికారిక ప్రకటన చేశారు. నాని తొలి ప్రయత్నంగా రాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమాను.. ఇప్పుడొచ్చిన హిందీ వెర్షన్ సాంగ్ బాగా రీచ్ అయ్యేలా చేస్తోందంటే అతిశయోక్తి కానే కాదు. అవును, ఈ హిందీ వెర్షన్ సాంగ్‌కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, పాజిటివ్ కామెంట్స్ కూడా పడుతున్నాయి. కొందరు నెటిజన్లు అయితే, తెలుగులో కంటే హిందీలోనే ఈ పాట చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఏ సింగర్స్ అయితే పాడారో, హిందీలోనూ వాళ్లే పాడటం విశేషం. ప్రముఖ తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చండి వోకల్స్ హిందీలోనూ ఒరిజినల్ ఫీల్‌ని ఇస్తున్నాయి. అందుకే విడుదలైన కాసేపటికే ఈ సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్‌ని రాబడుతోంది.

పాన్ వరల్డ్ సినిమాగా ‘ది పారడైజ్’

ఇంతకు వచ్చిన సాంగ్ గ్లోబల్ చార్ట్స్‌లో దాదాపు 9 దేశాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ట్రైబల్ పర్కషన్‌తో పాటు గ్రిటీ ఎలక్ట్రానిక్ సౌండ్స్‌ను కలిపి, ప్రైమల్ ఎనర్జీతో నిండిన థండరస్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ అందించిన అనిరుధ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ సాంగ్‌లో రా ఎనర్జీ, నాని స్క్రీన్ ప్రెజెన్స్‌ అదిరిపోయింది. ఆయన చేసిన ఐకానిక్ హుక్ స్టెప్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఫ్లోర్ మూవ్ అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లలో ట్రెండ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది. ‘ఆయా షేర్’ సాంగ్ విజయంతో ‘ది పారడైజ్’ సినిమా ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయని భావించవచ్చు. ఈ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచనాలు కూడా నెక్స్ట్ లెవల్‌కి చేరుకున్నాయి.

మొత్తానికి నాని పాన్ వరల్డ్ సినిమా ప్రయత్నం ‘ది పారడైజ్’తో సఫలం అవుతుందా లేదా చూడాలి. హిందీ వెర్షన్ సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్ సినిమాకి కలిసొచ్చే అంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.