
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి యాక్షన్ సీక్వెన్స్ వీడియోను విడుదల చేశారు. జైలు నేపథ్యంలో చిత్రీకరించిన ఈ సన్నివేశం నాని యొక్క డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Key Points
నాని 'ది ప్యారడైజ్' సినిమాలో మాస్ యాక్షన్ సీన్స్
జైలు నేపథ్యంలో చిత్రీకరించిన ఖచ్చితమైన యాక్షన్ సన్నివేశం
నాని డిఫరెంట్ లుక్, రెండు జడలతో ఆకట్టుకుంటున్నారు
వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానున్న 'ది ప్యారడైజ్'
‘ది ప్యారడైజ్’ యాక్షన్ సన్నివేశం
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ ది ప్యారడైజ్ ‘. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు . ఇటీవలే నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు . ఈ పోస్టర్ లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు . ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది . డిఫరెంట్ లుక్ లో నాని కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు .
నాని కొత్త లుక్
ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ వీడియోను పంచుకున్నారు మేకర్స్ . ఈ సీక్వెన్స్ ను జైల్లో తెరెకెక్కించినట్లు తెలుస్తోంది . ఈ ఫైట్ సీక్వెన్స్ లో నాని డిప్స్ కొడుతూ కనిపించారు . ‘ వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు ‘ అనే డైలాగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది . ది స్పార్క్ ఆఫ్ ప్యారడైత్ పేరుతో ఈ సీక్వెన్స్ రాప్ వీడియోను రిలీజ్ చేశారు .
విడుదల తేదీ
అయితే ఈ చిత్రంలో నాని సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా కనిపించనుందని టాక్ . ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు . ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు . వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.
మొత్తంగా, ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి విడుదలైన యాక్షన్ సీక్వెన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. నాని యొక్క కొత్త లుక్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మార్చి 26న థియేటర్లలో.


