|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ది రాజా సాబ్ కలెక్షన్ల సునామీ! ప్రభాస్ పవర్ చూపిస్తున్నాడుగా!! రికార్డు బ్రేకింగ్ మాస్ జాతర!

Published: 15-01-2026, 4:00 AM
ది రాజా సాబ్ కలెక్షన్ల సునామీ! ప్రభాస్ పవర్ చూపిస్తున్నాడుగా!! రికార్డు బ్రేకింగ్ మాస్ జాతర!
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఆరో రోజు కలెక్షన్లు: రూ. 5.25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం!
  • భారతీయ బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ నికరంగా రూ. 124.65 కోట్లు రాబట్టింది.
  • ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ‘ది రాజా సాబ్’ రూ. 175.70 కోట్లు వసూలు చేసింది.
  • రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా సగం కూడా రాబట్టలేక పోయింది.

ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఆరో రోజు కలెక్షన్ల జోరు పెరిగింది!

ప్రభాస్ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా తర్వాత  తగ్గిపోయింది. సినిమాకి విపరీతమైన నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అది మూవీపై తీవ్ర ప్రభావం చూపించింది.  అంతిమంగా కలెక్షన్లపై ఆ ప్రభావం కనిపించింది.

ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ వసూళ్ల లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమా వసూళ్లు రోజురోజుకు వేగంగా పడిపోతున్నాయి. సినిమా విడుదలై 6 రోజులు కాగా, ఆరో రోజు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నికరంగా రూ.124.65 కోట్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా ది రాజా సాబ్ వసూళ్లు ఎంతంటే?

‘ది రాజా సాబ్’ సినిమా ప్రీ-సేల్‌లో దాదాపు రూ.9.15 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో, మొదటి రోజు రూ.53.75 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. రెండు, మూడో రోజుల్లో ఈ సినిమా రూ.26 కోట్లు, రూ.19.1 కోట్లు వసూలు చేసింది. తొలి సోమవారం నాల్గో రోజు రూ.6.6 కోట్లు, ఐదో రోజు రూ.4.8 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఆరో రోజు వసూళ్లు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది కంటిన్యూ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.175.70 కోట్లు వసూలు చేసింది. అయితే టీమ్‌ మాత్రం ఈ మూవీ ఇప్పటికే రెండు వందల కోట్లు దాటినట్టు ప్రకటించింది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది.  ఈ నాలుగు రోజులు వసూళ్లని బట్టి దీని ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబడితేనే ఇది సేఫ్‌లో ఉంటుంది. లేదంటే డిజాస్టర్‌ అనే చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.

బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలి?

‘ది రాజా సాబ్’ ఒక హారర్ కామెడీ సినిమా. ఇందులో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు.

ది రాజా సాబ్ మూవీ కలెక్షన్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ కోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.