|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Raja Saab: హాట్ స్టార్ చేతికి ఓటీటీ హ‌క్కులు…ఎన్ని కొట్లంటే ?

Published: 09-12-2025, 8:48 AM
The Raja Saab: హాట్ స్టార్ చేతికి ఓటీటీ హ‌క్కులు...ఎన్ని కొట్లంటే ?
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది.
  • ఓటీటీ హక్కుల బేసిక్ ధర రూ.140 కోట్లు అని టాక్ నడుస్తోంది.
  • బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది.
  • మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! ‘ది రాజా సాబ్’ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు రూ.140 కోట్ల బేసిక్ ధరతో డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ మొత్తం మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

ఓటీటీ హక్కులు ఎవరికి?

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ది రాజా సాబ్ ( TheRajasaab ). సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. జనవరి 9వ తేదీన ఈ సినిమాను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. అయితే రిలీజ్ కంటే ముందే, ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్ స్టార్‌ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాకు దక్కని ధర ఈ మూవీకి వచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ ది రాజా సాబ్ సినిమా ఓటీటీ హక్కులు బేసిక్ ధర 140 కోట్ల రూపాయలు అని టాక్ నడుస్తోంది.

బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ రేటు పెరుగుతుందని చెబుతున్నారు. రూ.100 కోట్లు, రూ.150 కోట్లు, రూ. 200 కోట్లు ఇలా చేసుకుంటూ పోతే అదనంగా హాట్ స్టార్‌ మరికొంత మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించాల్సి ఉంటుందట. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంటే, నిర్మాతలకు పంట పండినట్లేనని అంటున్నారు. కాగా ఈ సినిమాను మారుతి డెరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ హీరోగా చేస్తుండ‌గా, మాళ‌విక‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా ఉండ‌నున్నారు.

భారీ ధరకు డీల్ ఖరారు?

సినిమా విడుదల ఎప్పుడు?

‘ది రాజా సాబ్’ ఓటీటీ హక్కుల డీల్ ప్రభాస్ స్టార్‌డమ్, సినిమాపై ఉన్న భారీ అంచనాలకు అద్దం పడుతోంది. ఈ భారీ ధర సినిమా విజయానికి మరింత సానుకూల సంకేతం. సంక్రాంతికి సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.