|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ది రాజాసాబ్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూలో ప్రభాస్, వంగా, ముగ్గురు హీరోయిన్స్! ఏమేం బయటపడ్డాయంటే?

Published: 07-01-2026, 5:05 AM
ది రాజాసాబ్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూలో ప్రభాస్, వంగా, ముగ్గురు హీరోయిన్స్! ఏమేం బయటపడ్డాయంటే?
  • ది రాజాసాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.
  • ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్వహించారు.
  • ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లు పాల్గొన్నారు.
  • ది రాజాసాబ్, స్పిరిట్ సినిమాల గురించి ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సంక్రాంతి 2026కి వస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మరియు ముగ్గురు హీరోయిన్లు పాల్గొన్న “కింగ్ సైజ్ ఇంటర్వ్యూ” ప్రోమో విడుదలైంది. ఇందులో ప్రభాస్ తన సినిమా ప్రయాణం, అనుభవాలపై సరదాగా మాట్లాడారు, అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

ప్రభాస్, వంగాతో హీరోయిన్స్ సందడి

The Raja Saab: సంక్రాంతి 2026కి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి.. ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 9న.. థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమాపై అంచనాలు మరింత పెంచేందుకు చిత్ర బృందం ప్రమోషన్లు జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో అభిమానుల్లో తెగ ఆనందాన్ని తీసుకొచ్చింది.

‘ది రాజాసాబ్’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలు కలిసిన ఈ సినిమా ప్రభాస్‌ను కొత్తగా చూపించబోతోందని ఇప్పటికే ట్రైలర్ స్పష్టం చేసింది. పాటలు కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రోమోతో.. సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్లు మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ పాల్గొన్నారు. ఈ సంభాషణను ప్రభాస్ తదుపరి సినిమా స్పిరిట్ తీస్తున్న.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డివంగా.. నిర్వహించడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ చాలా సరదాగాసస ఓపెన్‌గా మాట్లాడినట్లు కనిపిస్తోంది. తన సినిమా ప్రయాణం, ‘ది రాజాసాబ్’లో తన పాత్ర..షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి ఆయన పంచుకున్నారు.

#TheRajaSaab x Sandeep Reddy Vanga.

“ది రాజాసాబ్” షూటింగ్ విశేషాలు

𝗧𝗵𝗲 𝗞𝗶𝗻𝗴 𝗦𝗶𝘇𝗲 𝗜𝗻𝘁𝗲𝗿𝘃𝗶𝗲𝘄 𝗣𝗿𝗼𝗺𝗼 out now 😍❤️‍🔥 https://t.co/4wCug1s2l3

A Conversation to Remember with full on Masthi 🔥 #TheRajaSaabOnJan9th #Prabhas @imvangasandeep @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar pic.twitter.com/HNMi9WfXyP

— The RajaSaab (@rajasaabmovie) January 7, 2026

ప్రోమోలో దర్శకుఇదిడు మారుతితో పని చేసిన విధానం గురించి ప్రభాస్ నవ్వుతూ మాట్లాడిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. హీరోయిన్లు కూడా తమ పాత్రలు..సెట్స్‌లో ఉన్న వాతావరణం గురించి వివరించారు.

“స్పిరిట్”పై ఆసక్తికర చర్చ

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, సందీప్ రెడ్డి తదుపరి సినిమా స్పిరిట్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమా గురించి వీళ్లిద్దరూ పూర్తిగా ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే మాత్రం ఫుల్ ఇంటర్వ్యూ విడుదల అవ్వాలి.

ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు. “కింగ్ సైజ్ ఇంటర్వ్యూ” అంటూ వీడియోను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

“ది రాజాసాబ్” కింగ్ సైజ్ ఇంటర్వ్యూ ప్రోమో అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల సంభాషణ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. పూర్తి ఇంటర్వ్యూ విడుదల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.