|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాశికి షాక్ ఇచ్చిన డాక్టర్! ఎవరా నటి అంటే.. దిమ్మతిరగాల్సిందే!

Published: 07-03-2026, 11:35 PM
రాశికి షాక్ ఇచ్చిన డాక్టర్! ఎవరా నటి అంటే.. దిమ్మతిరగాల్సిందే!
  • రాశి ఖన్నా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నట్లు వీడియో ద్వారా వెల్లడి.
  • డాక్టర్ శ్రీలీల షూటింగ్ సెట్స్‌లో రాశికి వైద్య సలహాలు, చికిత్స అందించారు.
  • వైద్య విద్యను పూర్తి చేసిన శ్రీలీల ప్రస్తుతం సినీ ప్రముఖులకు సలహాలు ఇస్తున్నారు.
  • శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తూనే వైద్య వృత్తిని కొనసాగించడంపై నెటిజన్ల ప్రశంసలు.

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా జ్వరంతో బాధపడుతున్న విషయం వైరల్ అయింది. అయితే ఆమెకు వైద్యం చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. హీరోయిన్ శ్రీలీల, డాక్టర్ కూడా కావడంతో రాశికి వైద్యం చేసింది.

రాశి ఖన్నా అనారోగ్యం

Raashii Khanna : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య ఈమె చేసిన సినిమాలు పెద్దగా లేవు కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. రాశి కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఆమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా.. తన సినిమాల గురించి ఎన్నో విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. అందులో రాశి జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు హైలీ రికమండేడ్ డాక్టర్ దగ్గరికి వచ్చాను అని ఆమె అంటుంది. ఇంతకీ రాశి ఖన్నా కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

హీరోయిన్ రాశి ఖన్నా కొద్దిరోజులుగా గొంతు నొప్పి అలాగే తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. ఆమె యంగ్ హీరోయిన్ డాక్టర్ శ్రీ లీల దగ్గరికి వెళ్లినట్లు ఆ వీడియోలో చెప్పింది. రాశి మాట్లాడుతూ నేను జ్వరము గొంతు నొప్పితో బాధపడుతున్నాను. హైలీ రెకమెండేడ్ డాక్టర్ దగ్గరికి వచ్చాను అని శ్రీలీలను పరిచయం చేస్తుంది.. షూటింగ్ సెట్స్‌లో రాశీకి అనారోగ్యం కలిగినప్పుడు.. శ్రీలీల తన వైద్య పరిజ్ఞానంతో ప్రాథమిక చికిత్స, సలహాలు అందించినట్లు తెలుస్తోంది.. ఒకవైపు క్రేజీ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ఇలా డాక్టర్ గా తన వృత్తిని కూడా వదలకుండా చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..2025 నాటికే తన వైద్య విద్యను పూర్తి చేసి.. అధికారికంగా డాక్టర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో హాస్పిటల్ ప్రాక్టీస్ చేయకపోయినా కూడా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఏదైనా సమస్యలు వస్తే సలహాలు ఇస్తుందని తెలుస్తుంది మొత్తానికి రాశి ఖన్నా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

శ్రీలీల వైద్య సహాయం

వైరల్ అవుతున్న వీడియో

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే యంగ్ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీలీల.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కానీ స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పాగా వేస్తోంది.. ప్రస్తుతం ఈమె ఒకసారి పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది.. బాలీవుడ్‌లో కూడా శ్రీలీల జైత్రయాత్ర మొదలైంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఈ బ్యూటీ నటించింది. తదుపరి వరుణ్ ధావన్ సరసన ఒక భారీ ప్రాజెక్టులో నటించింది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నార్త్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. అలాగే తమిళంలో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ అమ్మడు ఒకవైపు ప్రొఫెషన్ ని, మరోవైపు వృత్తిని వదలకుండా ముందుకు సాగుతుంది..

మొత్తానికి రాశి ఖన్నా ఆరోగ్యం గురించి శ్రీలీల వైద్యం చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీలీల హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే వైద్య వృత్తిని కొనసాగించడం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.