|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు! టాలీవుడ్‌లో కలకలం!

Published: 24-03-2026, 9:05 PM
షాకింగ్: డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు! టాలీవుడ్‌లో కలకలం!
  • దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు, టాలీవుడ్‌లో ప్రకంపనలు!
  • సినిమా సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించారని, ఒంటరిని చేసి వేధించారని ఆరోపణ.
  • మైనర్‌గా ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిందని, కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని వెల్లడి.
  • త్వరలోనే దర్శకుడిపై ఫిర్యాదు చేయనున్న మోనాలిసా, న్యాయ పోరాటానికి సిద్ధం.

టాలీవుడ్ నటి మోనాలిసా సంచలన ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. దర్శకుడు సనోజ్ మిశ్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించడంతో పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి.

దర్శకుడిపై మోనాలిసా సంచలన ఆరోపణలు

కుంభమేళా కారణంగా ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ( Monalisa ) మరోసారి వార్తలు నిలిచారు. దర్శకుడు సనోజ్ మిశ్రాపై ( Director Sanoj Mishra) సంచలన ఆరోపణలు చేశారు. సినిమా సెట్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఒంటరి దాన్ని చేసి ఆడుకున్నారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు మోనాలిసా. ఈ ఘటన జరిగినప్పుడు తాను మైనర్ అని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటన చేశారు.

మైనర్‌గా ఉన్నప్పుడే వేధింపులు: మోనాలిసా ఆవేదన

ఇటీవల ఫర్హాన్ ఖాన్ ను వివాహం చేసుకున్న మోనాలిసా, తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారు. తన ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా, తన చిరకాల మిత్రుడు ఫర్హాన్ ఖాన్ ను ఇటీవలే మోనాలిసా పెళ్లి చేసుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలో వీళ్ళ వివాహం గ్రాండ్ గా జరిగింది. సరిగ్గా సంవత్సరం కిందట మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్హాన్ ఖాన్ , మోనాలిసాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమించుకుని, లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని మోనాలిసా ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

త్వరలో ఫిర్యాదు చేయనున్న మోనాలిసా

A post shared by The Cue (@thecue_official)

మోనాలిసా ఆరోపణలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.