|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The RajaSaab Telugu Teaser: ది రాజా సాబ్‌ టీజర్‌.. ఆ డైలాగ్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా?

Published: 18-06-2025, 8:56 AM
The RajaSaab Telugu Teaser: ది రాజా సాబ్‌ టీజర్‌.. ఆ డైలాగ్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ విడుదలైంది. కామెడీ, హారర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ టీజర్‌లోని ఒక డైలాగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం ఉపయోగించారు.

Key Points

1

ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' టీజర్ విడుదలైంది.

2

టీజర్‌లోని డైలాగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించారు.

4

'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి పోలీసుల ప్రయత్నాన్ని ప్రశంసించారు.

ది రాజా సాబ్ టీజర్ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. రొమాంటిక్‌ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్‌ మన రాజా సాబ్‌ టీజర్‌ విడుదలైంది. టీజర్‌  చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్‌ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.

అయితే ఈ టీజర్‌లోని ఓ డైలాగ్‌ను ఏకంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో  ది రాజాసాబ్‌ టీజర్‌లోని డైలాగ్‌ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.

ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం

అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్‌ను కూడా ట్రాఫిక్‌ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్‌పై వస్తున్న విజువల్స్‌ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్‌ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్‌ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

మారుతి స్పందన

ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్‌ఫెక్ట్‌.. మా సినిమా డైలాగ్‌ను పాజిటివ్‌ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్‌ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ది రాజా సాబ్’ టీజర్ ఆకట్టుకుంది. పోలీసుల క్రియేటివ్ ఐడియా నెట్టింట వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను పెంచుతోంది. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.