|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పవన్ తర్వాత చరణ్ సినిమాకు థియేటర్ల షాక్.. ఏం జరుగుతుందో?

Published: 10-04-2026, 11:05 AM
షాకింగ్: పవన్ తర్వాత చరణ్ సినిమాకు థియేటర్ల షాక్.. ఏం జరుగుతుందో?
  • పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ సమయంలో థియేటర్ల బంద్ ప్రకటన!
  • ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల వేళ మళ్ళీ థియేటర్ల మూసివేత వార్తలు!
  • నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజీ విధానంపై వివాదమే అసలు కారణం!
  • ఏప్రిల్ 30 వరకు క్లారిటీ రాకుంటే తెలంగాణలో థియేటర్లు బంద్ చేసే ఛాన్స్!

టాలీవుడ్‌లో మరో సంచలనం! పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో జరిగిన వివాదమే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు కూడా ఎదురవుతోంది. థియేటర్ల బంద్ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం!

పవన్ సినిమాకు అప్పుడు.. చరణ్ సినిమాకు ఇప్పుడు ఎందుకిలా?

Movie Theaters : గతంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు థియేటర్స్ బంద్ చేస్తామంటూ హడావిడి జరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పర్సెంటేజీ, రెంటల్ సిస్టమ్ కి సంబంధించి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదంతో ఆ బంద్ చేస్తామని అన్నారు. కొన్ని థియేటర్స్ కొన్ని రోజులు బంద్ నిర్వహించాయి కూడా. పవన్ సినిమాని అడ్డుకోడానికి థియేటర్స్ బంద్ ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో.

అయితే ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ సమయంలో కూడా మళ్ళీ థియేటర్స్ బంద్ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పర్సెంటేజీ, రెంటల్ సిస్టమ్ కి సంబంధించే బంద్ చేయాలనుకోవడం గమనార్హం. అప్పుడు ఏపీలో థియేటర్స్ బంద్ అంటే ఇప్పుడు నైజాంలో థియేటర్స్ బంద్ చేయాలని అంటున్నారు. తెలంగాణలో మే 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని ప్రతిపాదన నడుస్తుంది.

నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య అసలు గొడవేంటి?

ఇటీవల హైదరాబాద్ లోని ఓ 23 థియేటర్స్ పర్సెంటేజీ విధానంలో అయితేనే సినిమాలు మా థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి, రెంటల్ విధానంలో అయితే మేము సినిమాలు రిలీజ్ చేయమని నోటీసులు జారీ చేసారు. అయితే ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ నిర్మాతలు ఒప్పుకోలేదు. నిర్మాతలు రెంటల్ సిస్టమ్ వైపుకే మొగ్గు చూపుతున్నారు.

ఈ సమస్య ఫిలిం ఛాంబర్ వరకు కూడా వెళ్ళింది. ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఈ సమస్యపై ఎలాంటి క్లారిటీ రాకపోతే థియేటర్స్ బంద్ చేయాలని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 30నే పెద్ది సినిమా రిలీజ్ అనౌన్స్ చేసారు. మరి ఆ సమయానికి థియేటర్స్ – నిర్మాతల సమస్య పరిష్కారమవుతుందా? థియేటర్స్ బంద్ ఆగుతుందా చూడాలి. లేదంటే పెద్ది సినిమాకు ఎఫెక్ట్ అవ్వడం ఖాయం.

ఏప్రిల్ 30 వరకు తేడా వస్తే థియేటర్లు బంద్!

అయితే గతంలో హరిహర వీరమల్లు సినిమా సమయంలో, ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ సమయానికి కూడా ఒకే కారణంతో థియేటర్స్ బంద్ అనడం టాలీవుడ్ లో మరింత చర్చకు దారి తీస్తోంది.

చూశారుగా, టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో! థియేటర్ల బంద్ వార్తలు సినిమా అభిమానులను కలవరపెడుతున్నాయి. ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.