|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అంత ఈజీగా ఈ రాశుల వారు ఓటమిని ఒప్పుకోరు, చివరి వరకు ట్రై చేస్తూనే ఉంటారు!

Published: 26-09-2025, 11:47 PM
అంత ఈజీగా ఈ రాశుల వారు ఓటమిని ఒప్పుకోరు, చివరి వరకు ట్రై చేస్తూనే ఉంటారు!

జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు ఓటమిని అంత తేలికగా అంగీకరించరు. ఎంత కష్టమైనా చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. అలాంటి పట్టుదల, ధైర్యం గల రాశుల లక్షణాలు, వారి విజయ రహస్యాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Key Points

1

కొన్ని రాశుల వారు ఓటమిని అంగీకరించక, గెలిచే వరకు పోరాడుతారు.

2

ధనస్సు రాశి వారు జ్ఞానవంతులు, విజయం సాధించే వరకు విశ్రమించరు.

4

సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలతో, ఓడినా మళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి వారి దృఢ సంకల్పం

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పడంతో పాటు, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. ఒకరితో పోల్చుకుంటే మరి కొందరు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. ప్రతీ మనిషిలో కొన్ని బలహీనతలు, కొన్ని బలాలు ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే కొంత మంది అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. గెలిచే వరకు ఆ పనిని వదిలిపెట్టరు. అలాగే కొంతమంది సులువుగా వాటిని వదిలేస్తూ ఉంటారు. గెలుపు వస్తుందిలే అని ప్రయత్నం కూడా మానేసే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాశుల వారు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. గెలిచే వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశుల వారు గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అంత ఈజీగా ఓటమిని అంగీకరించరు. చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు. మరి అలాంటి వారు ఎవరు?

మేష రాశి వారి మనోబలం

ధనస్సు రాశికి అధిపతి గురువు . ఈ రాశి వారు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితి అయినా జాగ్రత్తగా ఎదుర్కోగలరు. విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు. వీరి దృఢ సంకల్పం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు.

వారు అనుకున్న బాటలో ముందుకు వెళ్తారు. అంత ఈజీగా శత్రువుల వలన ఓటమిని మాత్రం ఆఖరి క్షణం వరకు అంగీకరించరు. చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు.

సింహ రాశి వారి నాయకత్వ లక్షణాలు

మేష రాశికి అధిపతి కుజుడు . ఈ రాశి వారికి మనోబలం ఎక్కువ. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలరు. ధైర్యంగా నిలబడతారు. పట్టుదలతో శ్రమిస్తారు. ధైర్యాన్ని పెంచుకుంటూ వెళ్తారు. వీరి ధైర్యం తగ్గిపోదు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓటమిని అంగీకరించే దాకా కష్టపడుతూనే ఉంటారు.

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ధైర్యంగా ఉంటారు. అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. లక్ష్యాలను సాధించడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తారు. ఓడిపోయినా ఒప్పుకుని మళ్లీ ప్రయత్నిస్తారు. విజయాన్ని అందుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు.

ఈ విధంగా, ధనస్సు, మేష, సింహ రాశుల వారు అద్భుతమైన పట్టుదల, ధైర్యంతో తమ లక్ష్యాలను సాధిస్తారు. వారి సంకల్పం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. విజయం సాధించే వరకు పోరాడే తత్వం వారి ప్రత్యేకత.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.