|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫిబ్రవరి ఫీవర్: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి! ఏ సినిమా బ్లాక్ బస్టరో?

Published: 03-02-2026, 10:35 AM
ఫిబ్రవరి ఫీవర్: ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి! ఏ సినిమా బ్లాక్ బస్టరో?
  • గుణశేఖర్ దర్శకత్వంలో ‘యూఫోరియా’ మూవీ విడుదల, భూమిక, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటన!
  • బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా ‘సుమతీ శతకం’ మూవీ, ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్!
  • ‘శ్రీ చిదంబరం’ మూవీలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటన, వినయ్ రత్నం దర్శకత్వం!
  • మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ‘సుమతీ శతకం’ విడుదల, భారీ అంచనాలతో చిత్రం!

సంక్రాంతి సినిమాల హడావుడి తరువాత, ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కుర్ర హీరోలు తమ సత్తా చాటేందుకు వస్తున్నారు. ఈ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

గుణశేఖర్ ‘యూఫోరియా’: జెన్జీ కల్చర్ ఆవిష్కరణ!

సంక్రాంతికి విడుదలైన సినిమాల ప్రభావం నెల మొత్తం కొనసాగింది. దీంతో మధ్యలో రెండు వారాలు సరైన మూవీస్‌ లేవు.  ఈ వారం (ఫిబ్రవరి 6)న చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు. ఇంట్రెస్టింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. వాటిలో అమర్‌ దీప్‌ నటించిన `సుమతీ శతకం`, `శ్రీ చిదంబరం`, `ఎర్రచీర`, చంద్రహాస్‌ `బరాబర్‌ ప్రేమిస్తాం`, సౌందర్య రజనీకాంత్‌ నిర్మించిన `విత్‌ లవ్‌`, గుణశేఖర్‌ రూపొందించిన `యూఫోరియా`, అలాగే `స్కే` చిత్రాలున్నాయి.

స్టార్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకుడిగా రూపొందించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆయన తానేంటో మరోసారి నిరూపించుకునేందుకు వస్తున్నారు. అందులో భాగంగా `యూఫోరియా` అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో భూమిక, సారా అర్జున్‌, గౌతమ్‌ మీనన్‌, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందించారు. నేటి ట్రెండ్‌ని, జెంజీ కల్చర్‌ని ఆవిష్కరించేలా ఈ మూవీని రూపొందించారు. ఈ మూవీ ఈ శుక్రవారం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో గుణ శేఖర్‌ కమ్‌ బ్యాక్‌ అవుతారేమో చూడాలి. ఈ మూవీకి పెద్దగా బజ్‌ లేదు.

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, టీవీ నటుడు అమర్‌ దీప్‌ హీరోగా నటించిన చిత్రం `సుమతీ శతకం`. ఎంఎం నాయుడు దర్శకత్వంలో విజన్‌ మూవీ మేకర్స్ పతాకంపై సాయి సుధాకర్‌ కొమ్మాలపాటి నిర్మించారు. అమర్‌కి జోడీగా శైలి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 6నే విడుదల కాబోతుంది. దీనిపై మంచి అంచనాలున్నాయి.

అమర్ దీప్ ‘సుమతీ శతకం’: ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంచనాలు!

ఈ వారం విడుదలయ్యే చిత్రాల్లో అంత్యంత బజ్‌ ఉన్న మూవీ `శ్రీ చిదంబరం గారు`. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా గురించి దర్శకుడు చెబుతూ, `ఈ ప్రజెంటేషన్‌ మోర్‌ ఇన్‌ఫరియట్‌ కాంప్లెక్స్, ఇన్‌సెక్యూరిటీస్‌తో ఫీలవుతూ వాళ్ల లైఫ్‌ను కాన్పిడెంట్‌గా లీడ్‌ చేయాలేకపోతున్నారు. పక్కవాళ్లకు ఉన్నవి చూసి మనకు అవి లేవు కదా అని కంపేర్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి కథని ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంద`ని  తెలిపారు. అద్దంలో నిలబడి మనల్ని మనం చూసుకుని మనం బాగున్నామని ముందు మనం నమ్మాలి. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలగాలి అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించాలి అనేది ఈ కథ సారాంశమని చెప్పారు. దీన్ని వంశీ నందిపాటి విడుదల చేస్తుండటం విశేషం.

సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బరాబర్‌ ప్రేమిస్తా`. సంపత్‌ రుద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్‌ నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6నే విడుదల కానుంది. ఈ చిత్రంపై హీరో చంద్రహాస్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇందులో అనేక ట్విస్ట్ లు ఉన్నాయని తెలిపారు.

మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా `స్కై`. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘శ్రీ చిదంబరం’: విభిన్న కథతో వస్తున్న చిత్రం!

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ఎర్రచీర – ది బిగినింగ్`. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. అనేక సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతుంది.

సౌందర్య రజనీకాంత్‌ నిర్మించిన మూవీ `విత్‌ లవ్‌`. ఇందులో అభిషన్‌ జీవింత్‌ హీరోగా నటించగా, అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా చేసింది. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సౌందర్య హైదరాబాద్‌లో సందడి చేసింది. నేటి ట్రెండీ లవ్‌ స్టోరీగా దీన్ని రూపొందించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. మరి తెలుగు ఆడియెన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ వారం విడుదలయ్యే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తాయో చూడాలి. ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.