|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీల్లోకి ఈ వారం వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు.. మరో యాక్షన్ చిత్రం డబ్బింగ్‍లోనూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Published: 07-06-2025, 1:56 AM
ఓటీటీల్లోకి ఈ వారం వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు.. మరో యాక్షన్ చిత్రం డబ్బింగ్‍లోనూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ వారం ఓటీటీ ప్రేమికులకు శుభవార్త! మూడు కొత్త తెలుగు సినిమాలు మరియు ఒక బాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలలో అందుబాటులోకి వచ్చాయి. ‘సింగిల్’, ‘పెళ్లి కాని ప్రసాద్’, ‘జాట్’ మరియు ‘జిగేల్’ సినిమాల స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

శ్రీవిష్ణు 'సింగిల్' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్!

2

'పెళ్లి కాని ప్రసాద్' సినిమా ఈటీవీ విన్ లో అందుబాటులో!

4

'జిగేల్' సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ ప్రారంభం!

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

ఓటీటీల్లో కొత్తగా తెలుగు సినిమాలు చూడాలనుకుంటే ఈ జూన్ తొలి వారంలో కొన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. శ్రీవిష్ణు బ్లాక్‍బస్టర్ మూవీ సింగిల్ ఈ వారమే అడుగుపెట్టింది. మరో రెండు కామెడీ సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. బాలీవుడ్ మూవీ జాట్ మూవీ తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది. ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు సినిమాలు ఇవే..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన సింగిల్ చిత్రం ఈ శుక్రవారం (జూన్ 6) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. మే 9వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. రూ.14కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను దక్కించుకొని సక్సెస్ కొట్టింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ ప్రధానంగా సాగే సింగిల్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ రాజు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్

తెలుగు కామెడీ డ్రామా ‘పెళ్లి కాని ప్రసాద్’ చిత్రం ఈ గురువారం జూన్ 5వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. అయితే, అనుకున్న రేంజ్‍లో విజయం సాధించలేకపోయింది. ఎట్టకేలకు రెండు నెలలు దాటిన తర్వాత ఈటీవీ విన్‍లోకి పెళ్లి కాని ప్రసాద్ అడుగుపెట్టింది. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సప్తగిరి సరసన ప్రియాంక శర్మ హీరోయిన్‍గా చేశారు.

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ చిత్రం జూన్ 5న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఈ బాలీవుడ్ యాక్షన్ మూవీకి తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు డబ్బింగ్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలై రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో ఓ మోస్తరు హిట్ సాధించింది. ఈ జాట్ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్ హౌస్‍లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూజ్ చేశాయి.

సినిమాల విడుదల తేదీలు మరియు వివరాలు

తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ మూవీ జూన్ 5వ తేదీన సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో త్రిగుణ్, మేఘా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మల్లి ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడొచ్చు.

చివరగా, ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన తెలుగు సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాను ఎంచుకొని ఆస్వాదించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.