|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థగ్‌ లైఫ్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారతీయుడు 2ని టచ్‌ చేయలేకపోయిన కమల్‌ హాసన్‌

Published: 06-06-2025, 6:28 AM
థగ్‌ లైఫ్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారతీయుడు 2ని టచ్‌ చేయలేకపోయిన కమల్‌ హాసన్‌

పలు వివాదాల తరువాత విడుదలైన కమల్ హాసన్ నటనతో కూడిన థగ్ లైఫ్ సినిమా తొలి రోజు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. మిశ్రమ స్పందనతో పాటు, భారతీయుడు 2 కంటే తక్కువ వసూళ్లు రావడం గమనార్హం.

Key Points

1

థగ్ లైఫ్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ₹18 కోట్లు వసూలు చేసింది.

2

తమిళనాడులో ₹15.4 కోట్లు, తెలుగులో ₹1.5 కోట్లు వసూలు.

4

భారతీయుడు 2 కంటే తక్కువ వసూళ్లు సాధించింది థగ్ లైఫ్.

థగ్ లైఫ్ కలెక్షన్ల విశ్లేషణ

పలు వివాదాల అనంతరం కమల్‌ హాసన్‌ `థగ్‌ లైఫ్‌` సినిమా గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటించగా, త్రిష, అభిరామి కమల్‌కి జోడీగా చేశారు. అశోక్‌ సెల్వన్‌, నాజర్‌, తనకెళ్ల భరణి, మహేష్‌ మంజ్రేకర్ కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.

భారీ అంచనాలతో గురువారం విడుదలైన `థగ్‌ లైఫ్‌` సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమాలో కొన్ని మైనస్‌లు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఎంచుకున్న కథ కొత్తగా లేదని,

ఆయన టేకింగ్‌ కూడా ఆకట్టుకునేలా లేదనే టాక్‌ వినిపిస్తుంది. కమల్‌ హాసన్‌ నటనతో మ్యాజిక్‌ చేసినప్పటికీ ఆ స్థాయిలో కథ, కథనాలు లేకపోవడంతో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు.

ఇంకోవైపు సినిమా చాలా స్లోగా ఉండటం, రెహ్మాన్‌ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం కూడా మైనస్‌గా చెబుతున్నారు. శింబు పాత్రని కూడా సరిగా వాడుకోలేదని, త్రిష పాత్రకి కూడా ప్రయారిటీ లేదనే విమర్శలు వచ్చాయి.

సినిమాకు మిశ్రమ స్పందన

అంతేకాదు త్రిషని బాగా ట్రోల్‌ చేస్తున్నారు. కాకపోతే సినిమాలో ఇంటర్వెల్‌ ట్విస్ట్, క్లైమాక్స్ మాత్రమే  బలంగా నిలిచాయి. అవి మాత్రం ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

మొత్తంగా మిశ్రమ స్పందన అందుకుంటోన్న `థగ్‌ లైఫ్‌` చిత్రం తొలి రోజు ఎంత వసూళ్లని రాబట్టిందనేది చూస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.18కోట్లు వసూలు చేసిందట. 15.4 కోట్లు తమిళనాడులో, రూ.1.5కోట్లు తెలుగులో, నార్త్ లో పది లక్షల వరకు మాత్రమే వచ్చాయి.

మలయాళంలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కోటికిపైగానే వచ్చినట్టు సమాచారం. కర్ణాటకలో సినిమా విడుదల కాలేదు. ఈ ప్రభావం సినిమాపై గట్టిగానే ఉండబోతుంది.

భారతీయుడు 2తో పోలిక

ఇక కమల్‌ కి `థగ్‌లైఫ్‌` పెద్ద షాకిచ్చింది. ఈమూవీ ఆయన గత చిత్రం `భారతీయుడు 2` ని కూడా దాటలేకపోయింది. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్‌ టాక్ తెచ్చుకున్న `భారతీయుడు 2` మొదటి రోజు కలెక్షన్లని.. ఫస్ట్ డే మిశ్రమ స్పందన రాబట్టుకున్న `థగ్ లైఫ్‌` దాటలేకపోవడం గమనార్హం.

శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన `భారతీయుడు 2` ఫస్ట్ డే రూ.25కోట్లు వసూలు చేసింది. కానీ `థగ్‌ లైఫ్‌` రూ.18కోట్లకే పరిమితమయ్యింది. అయితే ఈ మూవీ ఆడితే శని, ఆదివారం వరకే, ఆ తర్వాత నిలబడటం కష్టమనే చెప్పాలి.

కాకపోతే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో కొంత కలిసొచ్చే అంశం. మరి అది ఈ చిత్రానికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

మొత్తంగా, థగ్ లైఫ్ మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలి రోజు వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం నిరాశపరిచింది. వచ్చే రోజుల్లో సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.