
📌 Key Points
- మణిరత్నం చివరి సినిమా ‘థగ్ లైఫ్’ నిరాశపరిచింది.
- విజయ్ సేతుపతి, సాయి పల్లవితో రొమాంటిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్న మణిరత్నం.
- సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ మణి సినిమాను ఎంచుకోవడంపై విమర్శలు.
- మణిరత్నం మునుపటి ఫామ్ అందుకుంటాడా అని అభిమానుల సందేహం.
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కలిసి నటిస్తున్న కొత్త సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా వారి కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అనేది చూడాలి.
మణిరత్నం ఫామ్ కోల్పోయాడా?
Mani Ratnam: మణి రత్నం…దళపతి,రోజా,బొంబాయ్,గీతాంజలి వంటి సినిమాలతో ఇండియన్ సినిమాపై చెరగని సంతకం చేసిన ఈ స్టార్ డైరెక్టర్ గత కొంతకాలంగా సక్సెస్ అడ్రస్ పట్టుకోలేకపోతున్నాడు.ముఖ్యంగా మణి నుండి వచ్చిన చివరి సినిమా ‘థగ్ లైఫ్’ ఎంత డిసప్పాయింట్ చేసిందో చెప్పక్కర్లేదు.నాయకుడు వంటి కల్ట్ ఫిలిమ్ తీసిన మణి మళ్ళీ కమల్ హసన్ తో సినిమా అంటే అంతకు మించి ఉంటుందని తెగ ఆశ పడ్డారు.కాని మించి కాదు కాదా టోటల్ ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ నే మంట గలిపెసింది.అయితే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాల్సిందే అంటూ అచ్చొచ్చిన లవ్ జానర్లో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడట మణి.
ఈ ప్రాజెక్ట్ మే 14న లాంఛనంగా
అందులో భాగంగా మద్రాస్ టాకీస్,లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి మోస్ట్ అవైటేడ్ స్టార్స్ కాంబోలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేశాడని,ఈ ప్రాజెక్ట్ మే 14న లాంఛనంగా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని అదే రోజు నుండి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేయనున్నారట.అయితే ఈ లోపే సినిమా పై ఒక స్పెషల్ ప్రోమో ని కట్ చేసి అఫీషియల్ గా మూవీ ని అనౌన్స్ చేస్తారని టాక్.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కలసి వచ్చిన రెహమాన్ నే మళ్ళీ తీసుకోబోతున్నాడట.అయితే ఇదే రెహమాన్ మణి కాంబోలో వచ్చిన భారీ అంచనాలతో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ తెలుగు,హిందీ మార్కెట్లలో అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.మరి ఈ ఆల్బమ్ ఏ మేరకి ఆకట్టుకుంటుందో చూడాలి.
సాయి పల్లవి రిస్క్ చేస్తోందా?
మణి మళ్ళీ మునుపటి ఫామ్ అందుకోగలడా
ఇవన్ని ఇలా ఉంటె సాయి పల్లవి,విజయ్ సేతు పతిలు మణి రత్నం తో సినిమా చేస్తున్నారు అన్న వార్త రాగానే భయపడిపోతున్నారు ఫ్యాన్స్.అసలే సాయి పల్లవి కెరీర్ ఇపుడు గోల్డెన్ పీరియడ్‌లో ఉంది.ఒకవైపు తొలిసారిగా నటించిన హిందీ సినిమా ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ అవుతుంది,మరో వైపు రణ్‌బీర్ కపూర్ తో కలిసి నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రామాయణ’ పార్ట్-1 ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.ఇంతటి క్రేజీ లైనప్‌లో ఉన్న సాయి పల్లవి,వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం సినిమాను ఏరికోరి ఎంచుకోవడం అంటే ఏరి కోరి కెరీర్ ని బలి పెడుతున్నట్టే అన్న టాక్ వినిపిస్తుంది.అసలే అవుట్ డేటెడ్ అయిపోయిన మణి మళ్ళీ మునుపటి ఫామ్ ని అందుకోగలడా అన్నది పల్లు ఫ్యాన్స్ వేస్తున్న క్వశ్చన్.ఎందుకంటే దశాబ్దం కిందట వచ్చిన ‘‘ఓకే బంగారం’’తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అని అనుకుంటే అదే రొమాంటిక్ జానర్లో వచ్చిన చెలియాతో మళ్ళీ డిజాస్టర్ ని ఫేస్ చేసిన పరిస్థితి.
విజయ్ సేతుపతికి కలిసొస్తుందా?
విజయ్ సేతుపతి మాస్ ఇమేజ్ ఎలా మ్యాచ్ చేస్తాడో
ఇక సాయిపల్లవితో జోడీ కడుతున్న విజయ్ సేతుపతి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.మణి రత్నం తీసిన ‘చెక్క చివంత వానం’లో విజయ్ నటించినప్పటికి ఇప్పటికీ విజయ్ సేతుపతి ఇమేజ్ కంప్లీట్ గా మారిన పరిస్థితి.మరి క్లాస్ గా కూల్ స్క్రీన్ ప్లే తో రొమాంటిక్ ఫిలిమ్స్ తీసే మణి విజయ్ సేతు పతి మాస్ ఇమేజ్ ని ఎలా మ్యాచ్ చేస్తాడా అంటూ ఆలోచనలో పడ్డారు తమిళ తంబీలు.ఇక విజయ్ సేతు పతి ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్’ చేస్తున్న సంగతి తెల్సిందే.చూడాలి మరి ఏరి కోరి ఎంచుకుంటున్న ఈ సాయి పల్లవి,విజయ్ సేతు పతిలు మణి రత్నం లవ్ స్టోరీకి ఏ మేరకు మ్యాచ్ అవుతారో.ఏది ఏమైనా ఒకప్పుడు కల్ట్ సినిమాలతో ఇండియన్ సినిమాని షేక్ చేసిన మణిపై ఇప్పుడిలా అవుట్ డేటెడ్ అంటూ రూమర్స్ రావడం బాధాకరమే.
మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సాయి పల్లవి, విజయ్ సేతుపతి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మణిరత్నం తన ఫామ్‌ను తిరిగి పొందుతాడో లేదో చూడాలి.


