|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thug Life Movie: కమల్-శింబు ‘థగ్ లైఫ్’

Published: 04-06-2025, 2:12 PM
Thug Life Movie: కమల్-శింబు 'థగ్ లైఫ్'

తమిళ హీరో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న విడుదలవుతోంది. కానీ, కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కర్ణాటకలో సినిమా విడుదల కాదని కమల్ ప్రకటించాడు.

Key Points

1

కమల్ హాసన్, శింబు నటించిన 'థగ్ లైఫ్' జూన్ 5న విడుదలవుతోంది.

2

కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల వల్ల వివాదం.

4

మూవీ మేకింగ్ వీడియో విడుదలైంది.

కమల్ హాసన్ వివాదం

గత కొన్నిరోజుల నుంచి తమిళ హీరో కమల్ హాసన్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీనికి కారణం ‘థగ్ లైఫ్’ సినిమా. కొన్నిరోజుల క్రితం జరిగిన చిత్ర ఈవెంట్‌లో మాట్లాడుతూ కన్నడ భాష.. తమిళం నుంచే పుట్టిందని అన్నాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కమల్ వేసిన పిటిషన్ వల్ల ఈ వివాదంలోకి కర్ణాటక హైకోర్ట్ కూడా ఎంటరైంది. సారీ చెబితే సరిపోతుంది కదా అని చివాట్లు పెట్టింది.

‘థగ్ లైఫ్’ విడుదల తేదీ

ఇలా కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. మరోవైపు ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా జూన్ 05న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఎలాంటి లొకేషన్స్‌లో మూవీని చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోకి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్‌గా ఉంది.

దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. వీళ్లే నిర్మాతలగానూ వ్యవహరించారు. మరి కమల్ కావాలనే కన్నడ ప్రేక్షకులతో ఈ గొడవ పెట్టుకున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పనని లెటర్ రిలీజ్ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్తులో తమిళ మూవీస్‌కి సెగ తప్పదేమో అనిపిస్తుంది. మరి చూడాలి కమల్ ‘థగ్ లైఫ్’తో ఏం చేస్తాడో?

మూవీ మేకింగ్ వీడియో

కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలతో పాటు, కన్నడ వివాదం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. ఈ వివాదం భవిష్యత్తులో తమిళ సినిమాలకు ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.