|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్.. దుష్ట శక్తిపై పిల్లల పోరాటం.. భయంతో వణికించే సీన్లు

Published: 27-10-2025, 3:09 AM
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్.. దుష్ట శక్తిపై పిల్లల పోరాటం.. భయంతో వణికించే సీన్లు

ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇట్: వెల్కమ్ టు డెర్రీ’ ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దుష్టశక్తిపై పిల్లల పోరాటంగా తెరకెక్కిన ఈ సిరీస్ వెన్నులో వణుకు పుట్టించే భయానక సన్నివేశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. ఈ సిరీస్ వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.

2

ఇట్: వెల్కమ్ టు డెర్రీ సిరీస్ 8 ఎపిసోడ్ల హారర్ థ్రిల్లర్ గా రూపొందింది.

4

పట్టణం కింద దాగి ఉన్న దుష్టశక్తిని ఆయుధంగా మార్చాలనుకునే ప్రయత్నాలు ఈ సిరీస్ ముఖ్య అంశం.

ఇట్: వెల్కమ్ టు డెర్రీ ఓటీటీ స్ట్రీమింగ్

ఆడియన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టిస్తూ, క్లాసిక్ హారర్ థ్రిల్లర్ గా పేరు సంపాదించే సిరీస్ ఓటీటీలోకి ఇవాళ అడుగుపెట్టింది. దుష్టశక్తిపై పిల్లల పోరాటంగా ఈ సిరీస్ తెరకెక్కింది.

క్షణక్షణం ఉత్కం రేపుతూ, వెన్నులో వణుకు పుట్టించే భయాన్ని కలిగిస్తూ, అదిరిపోయే థ్రిల్ పంచే వెబ్ సిరీస్ కావాలా? అయితే ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ సిరీస్ మీకోసమే. అదిరిపోయే ఈ హారర్ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ ఆడియన్స్ ను వణికించేందుకు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు.

దుష్టశక్తిపై పిల్లల పోరాటం

ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ ఓటీటీ

8 ఎపిసోడ్ల హారర్ థ్రిల్లర్

కథా నేపథ్యం, ఆసక్తికర అంశాలు

ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ కథ

1962లో ‘ఇట్’ సినిమాలోని సంఘటనలకు సరిగ్గా 27 సంవత్సరాల ముందు ఈ కథ జరుగుతుంది. ‘వెల్కమ్ టు డెర్రీ’ ఆ పట్టణం కింద దాగి ఉన్న దుష్టశక్తి పుట్టుకకు సంబంధించిన కథగా పనిచేస్తుంది. ఆ పట్టణంలోని ఒక సైనిక స్థావరం, అక్కడ దాగి ఉన్న శక్తిని తవ్వి తీసి ఆయుధంగా మార్చాలని అనుకుంటుంది. కానీ ఒక చిన్న పిల్లాడు అదృశ్యమైన తర్వాత, ఆ శక్తి చెడ్డదని అతని స్నేహితులు గ్రహిస్తారు. పెద్దలు వారి మాట వినకపోవడంతో, దానిని ఆపగలిగేది తామేనని వారు తెలుసుకుంటారు.

ఇట్: వెల్కమ్ టు డెర్రీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది తప్పక నచ్చుతుంది. ఈ హారర్ జర్నీని వీక్షించేందుకు సిద్ధం కండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.