|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Today Rasi Phalalu (12.04.2025): ఈరోజు రాశిఫలాలు: నూతన అవకాశాలు, వస్త్ర, ఆభరణాలు!

Published: 11-04-2025, 7:07 PM
Today Rasi Phalalu (12.04.2025): ఈరోజు రాశిఫలాలు: నూతన అవకాశాలు, వస్త్ర, ఆభరణాలు!

12.04.2025 నాటి రాశిఫలాలను తెలుసుకుందాం. ఈ రోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, విద్యపై సూచనలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

2

వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు.

4

కర్కాటక రాశి వారికి ఉద్యోగ అవకాశాలు.

మేషం నుండి కర్కాటకం వరకు రాశిఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : శనివారం, తిథి : శు. పూర్ణిమ, నక్షత్రం : హస్త

మేష రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్ద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకండి. ఖర్చులు ఆదాయాలకు మించకుండా చూసుకోండి. కుటుంబంలో సంయమనాలకు ప్రాధాన్యతనీయండి. విద్యార్థుల క్రమశిక్షణ, కాలనియమాలు తప్పనిసరి పాటించుకోండి. ఆధ్యాత్మికతకు రోజూ కొంత సమయం కేటాయించుకోండి.

వృషభ రాశి వారికీ నూతన సంవత్సరం ఆరంభంలో ఉత్సాహముగా ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త ఆశలు చిగురించగలవు. పెద్దవైన టార్గెట్స్ రూపొందించుకోగలరు. సముచితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నూతనమైన వ్యాపకాలకై దృష్టిని పెట్టగలరు. ఆత్మీయులతో ఉత్సాహాలు పంచుకోగలరు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి. అధికారిక అవకాశాలు పొందగలరు.

సింహం నుండి తుల రాశి వరకు రాశిఫలాలు

మిథున రాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. శ్రమించి ప్రయోజనాలు పొందాలి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు ఏర్పడకుండా జాగ్రత్తలు అవసరం. అవకాశాలను అందిపుచ్చుకోవాలా అనే ప్రయత్నాలుంటాయి. ఏ విషయాలనూ తీవ్రంగా భావించకండి. ఇబ్బందులు శాశ్వతంగా భావించకండి. విద్యార్థులు వ్యాసంగాలపట్ల అంకిత భావంతో సాగాలి.

కర్కాటక రాశి వారు లక్ష్యములు ఏర్పరచుకొని యత్నాలు కొనసాగించుకోండి. బాధ్యతాయుత ప్రవర్తనలు చేయగల్గుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలలో సాధారణతలు కొనసాగుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు భారాల్ని స్వీకరిస్తారు. స్నేహవర్గంచే ప్రేమాభిమానాలు చూడగలరు. విదేశీ వస్తు సేకరణలు ఉంటాయి.

సింహ రాశి వారికి అష్టమ శని ఏర్పడుట, అష్టమములో ఆ కూటమి ప్రభావాలు ఉండుటచే అన్నిటా జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులైనా సందేహబుద్ధితో సాగి, చిన్న పనైనా వాయిదాల పద్ధతికి దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఇంటి విషయాల్లో సంయమనాలు తప్పనిసరి చేయాలి. సాధ్యమైనంతవరకు రొటేషన్ పనులకే ప్రాధాన్యతనిచ్చుకోండి.

కన్య రాశి వారికి ప్రయత్న కార్యములు అనుకూలించినా కుటుంబంలో అనారోగ్యం, ఔషధసేవలు ఉండు సూచనలు ఉన్నాయి. అనవసర విషయాలకు దూరంగా ఉంటూ కర్తవ్యాలకు అంకితమగుటయే మేలు. అదనపు బాధ్యతలు ఏర్పడినప్పుడు సున్నితంగానే తిరస్కరించండి. విద్యార్థులు నూతన అవకాశాలను చేజిక్కించుకొనగలరు. నూతన వస్త్ర, ఆభరణాలు ఏర్పరచుకోగలరు.

తులా రాశి వారికి గతం కంటే మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. అవకాశాలు పెరుగుతాయి. మాట తీరు అదుపులో ఉంచుకోవాలి. సహకారములు కోరువారు పెరుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అంకితభావాలు చూపగలరు. విద్యార్థులకు వ్యాసంగాలు, ప్లేసుమెంట్లు అనుకూలిస్తాయి. స్థిరాస్తులపట్ల మంచి నిర్ణయాలను తీసుకోగలరు. నూతన ప్రాజెక్టులు, ప్రణాళికలు వంటివి ఏర్పరచుకోగలరు.

వివిధ రాశులకు సూచనలు

వృశ్చిక రాశి వారికి గ్రహసంచారాలలో అర్ధాష్టమ శని వీడుట, శుభావహ స్థితులు ఏర్పడుతున్నా అన్నిటా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు ఏర్పడతాయి. వాహన, యంత్రాదులలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వ్యాపారాలను ఉత్సాహంగా నిర్వహించగలరు.

ధనుస్సు రాశి అర్ధాష్టమ శనితో కూటమి ప్రభావమును కూడా సమర్థించుకోవలసి రావచ్చును. కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగాలి. ఎదుటివారితో అవసరాలకు తగినట్లు వ్యవహరించుకోవాలి. ఆర్థిక, అవసరాలపట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. ధన సమస్యలెదురయ్యే సూచనలు ఉన్నాయి. అధికారులతో సంయమనాలకు ప్రాధాన్యతనివ్వాలి.

మకర రాశి వారు శని మార్పుచే చిన్నతరహా ప్రయోజనాలు చూడగలరు. అవకాశాలు కలసివస్తాయి. కుటుంబంలో సంయమనాలు అవసరం. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. వ్యాపార, వ్యవహారాలలో అనుకొన్నవి పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో క్రమంగా మంచి మార్పులు చూడగలరు. నేటి నిర్ణయాలు కొన్ని భవిష్యత్ను ప్రభావితం చేస్తాయి.

కుంభ రాశి వారికి గ్రహసంచారాలు సామాన్య ప్రయోజనాలనిస్తాయి. ప్రణాళికాబద్ధంగా సాగాలి. ఆర్థిక అవసరాలపట్ల ముందు జాగ్రత్తలు అవసరం. కొన్ని చికాకులు ఎదుర్కోవలసివచ్చినా మనో ధైర్యంతో సాగాలి. కుటుంబ పెద్దల సహకారాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించుకోవాలి. చేర్పులు మార్పులకు దూరంగా ఉండండి. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి సాగాలి. విద్యార్థులు పునశ్చరణలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి.

మీన రాశి వారు జన్మమందు కూటమి స్థితులున్నా శ్రమ, పట్టుదలలు చూపి ప్రయోజనాలు పొందుతారు. ఇతరులను నొప్పించక లౌక్యంగా వ్యవహరించుకొంటారు. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి తీర్థయాత్రలు చేయగలరు. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు చేసుకొంటారు. ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. గత పొరపాట్లను గుర్తుంచుకొని ధైర్యంగా వ్యవహరించుకోగలరు.

ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలకు మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.