|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2027 సంక్రాంతి ఫైట్: చిరు vs తేజ vs శర్వానంద్! బాక్సాఫీస్ బద్దలే!!

Published: 17-01-2026, 3:00 PM
2027 సంక్రాంతి ఫైట్: చిరు vs తేజ vs శర్వానంద్! బాక్సాఫీస్ బద్దలే!!
  • మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతి 2027కి సిద్ధం!
  • తేజ సజ్జా ‘జాంబిరెడ్డి 2’తో మ‌రోసారి వ‌చ్చే సంక్రాంతికి థియేటర్ల‌లో సందడి చేయనున్నారు!
  • శర్వానంద్ 39వ సినిమా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీగా రానుంది.
  • అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వ‌స్తున్నాం 2’తో 2027లో మ‌రోసారి న‌వ్వులు పూయించ‌డానికి రెడీ!

2027 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరగబోతోంది! మెగాస్టార్ చిరంజీవి నుండి యంగ్ హీరోల వరకు చాలా మంది పోటీ పడనున్నారు. ఆ సినిమాలేంటో చూసేద్దాం!

చిరంజీవి vs ఇతరులు: సంక్రాంతి పోరు!

ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు సంబంధించిన ఐదు సినిమాలు రిలీజ్ అయి దాదాపు సక్సెస్ అందుకున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మినహా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2027 సంక్రాంతి బరిలో ఉండే సినిమాల లిస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. వచ్చే సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి మరోసారి రంగంలోకి దిగుతాడని టాక్ నడుస్తోంది.

‘జాంబిరెడ్డి 2’తో తేజ సజ్జా రీ ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి 158 సినిమా బాబీ దర్శకత్వంలో రాబోతుంది. కెవిఎన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందట. అలాగే కుర్ర హీరో తేజ సజ్జా జాంబిరెడ్డి 2 సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని టాక్. మరోసారి శర్వానంద్ కూడా తన 39వ సినిమాతో 2027 సంక్రాంతి బరిలో ఉండబోతున్నాడట.

శ్రీను వైట్లతో శర్వానంద్ మూవీ

శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారట. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. రజినీకాంత్ త‌న కొత్త‌ సినిమాతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నార‌ట‌. ఇక సంక్రాంతి వీరుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాను కూడా 2027లో తీసుకురాబోతున్నారట. 2025లోనే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు. నెక్ట్స్ ఈ సినిమా సీక్వెల్ తో వ‌స్తున్నారు. మరి ఈ సినిమాలలో ఏది హిట్ అవుతుందో చూడాలి.

2027 సంక్రాంతికి ఈ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.