|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 10 లక్షల కోసం 10 వేల కోట్ల ఆస్తి పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్! అసలేం జరిగిందంటే?

Published: 09-02-2026, 12:35 PM
షాకింగ్: 10 లక్షల కోసం 10 వేల కోట్ల ఆస్తి పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్! అసలేం జరిగిందంటే?
  • షాకింగ్: పృథ్వీరాజ్ 30 ఏళ్ల క్రితం శంషాబాద్‌లో 100 ఎకరాల భూమిని కేవలం 10 లక్షలకే వదులుకున్నారు!
  • 1996లో ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో నటించిన పృథ్వీరాజ్.. భారీ పారితోషికం అందుకున్నారు.
  • డ్రైవర్ సలహాతో ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన రావడంతో వంద ఎకరాల భూమి కొనుగోలు నిర్ణయం విరమించుకున్నారు.
  • `యానిమల్` సినిమాలో నెగటివ్ రోల్‌తో పృథ్వీరాజ్ రీసెంట్‌గా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు.. మళ్ళీ బిజీ అయ్యారు.

టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కు సంబందించిన ఒక సంచలన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన పృథ్వీరాజ్ భారీగా ఆస్తిని ఎలా పోగొట్టుకున్నారో తెలుసుకుందాం రండి!

10 లక్షలకే 100 ఎకరాలు.. మిస్ చేసుకున్న నటుడు!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట, శంషాబాద్‌ వంటి ఏరియాలు అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు వంద కోట్ల వరకు ఉంటుంది. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో వేలం వేస్తే ఒక్కో ఎకరం వంద కోట్లకు అమ్ముడుపోయింది. శంషాబాద్‌లో ఒక్కో ఎకరం ఇప్పుడు మినిమమ్‌గా యాభై కోట్ల వరకు పలుకుతుంది. ఎక్కువగా వంద కోట్లు అని చెప్పొచ్చు. అయితే శంషాబాద్‌ ప్రాంతంలో 30ఏళ్ల క్రితం వంద ఎకరాల ల్యాండ్‌ని మిస్‌ చేసుకున్నాడు టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌.

ఆ నటుడు ఎవరో కాదు, ఒకప్పుడు హీరోగా, సెకండ్‌ హీరోగా నటించి మెప్పించిన బబ్లూ పృథ్వీరాజ్‌. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలతో అలరిస్తున్నారు. కానీ ఒకప్పుడు స్టార్‌ యాక్టర్‌గా రాణించారు. స్టార్‌ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. అత్యంత బిజీ యాక్టర్‌ కూడా. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.   `పెళ్లి`, `పెళ్లి పందిరి`, `దేవుళ్లు`, `బాచీ`, `కంటే కూతురునే కను` ఇలా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా రాణించారు. 1990 నుంచి 2006 వరకు తెలుగు, తమిళ, కన్నడలో సినమాలు చేస్తూ బిజీగా గడిపారు.

డ్రైవర్ సలహాతో తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు ఎలా ఉందంటే?

మధ్యలో కొంత కాలం గ్యాప్‌ వచ్చింది. ఆయన తీసుకున్నారా? వచ్చిందా అనేది క్లారిటీ లేదుగానీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. ఇటీవల `యానిమల్‌`లో నెగటివ్‌ రోల్‌ చేశారు. ఈ సినిమా ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ అయ్యేలా చేసింది. ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్‌కి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వైరల్‌ అవుతుంది. ఇందులో ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. వేల కోట్ల ఆస్తిని ఎలా పోగొట్టుకున్నారో తెలిపారు.

1996 ఆ టైమ్‌లో పృథ్వీరాజ్‌ ఎంత బిజీగా ఉండేవాడంటే ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు పృథ్వీరాజ్‌. ఆ సమయంలో పారితోషికాలు కూడా బాగానే వచ్చేవి. దీంతో ప్రాపర్టీ కొనాలనుకున్నారు. ఓ ఇంటిని కొనాలా? లేక ల్యాండ్‌ని తీసుకోవాలా అనే ప్రశ్న వచ్చింది. ఓ స్నేహితుడు తనకు శంషాబాద్‌ సమీపంలో వంద ఎకరాలు చూపించాడట. తనని మధ్యలోకి తీసుకెళ్లి ఇటు వైపు యాభై ఎకరాలు, అటు వైపు యాభై ఎకరాలు అని చెప్పి, వంద ఎకరాలు మొత్తం పది లక్షలకే అన్నాడట. అంత తక్కువగా వస్తుందని చెప్పి పృథ్వీరాజ్‌ టెంప్ట్ అయ్యారట. తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే డ్రైవర్‌తో ఈ డిస్కషన్‌ వచ్చిందట. అతను కింద మొత్తం రాయి సార్‌. కొనడానికి పది లక్షలు అయితే, దానికి ఫెన్సింగ్‌ చేయించడానికి ఇరవై లక్షలు అవుతుందన్నాడట.

యానిమల్ మూవీతో రీఎంట్రీ.. పృథ్వీరాజ్ సక్సెస్ సీక్రెట్స్!

దీంతో పృథ్వీరాజ్‌ వెనక్కి తగ్గారు. వెళ్లి పది లక్షలకు దొరికిన ఇంటిని కొన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఐదారు కోట్ల వరకు ఉంటుంది. కానీ అదే వంద ఎకరాల ల్యాండ్‌ విలువ ఇప్పుడు వెయ్యి కోట్లకుపైగానే ఉంటుంది. ఎందుకంటే అదే ఏరియాలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ వచ్చింది. అక్కడ ఒక్కో ఎకరం 50-100 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన పృథ్వీరాజ్‌ వేల కోట్లు పోగొట్టుకున్నాడు. అదే కొని ఉంటే టాలీవుడ్‌ సినిమా సెలబ్రిటీల్లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచేవాడు పృథ్వీరాజ్‌. ఇప్పుడు సాధారణ యాక్టర్‌గానే మిగిలిపోయారు. ఈ విషయాన్ని ఆ మధ్య అలీతో సరదాగా టాక్‌ షోలో పృథ్వీరాజ్‌ వెల్లడించి ఆవేదన వ్యక్తం చేశారు.

పృథ్వీరాజ్ తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.