|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జగపతి బాబుకు ఊహించని షాక్! ఆ సినిమా చేసినందుకు అభిమాని ఫోన్ చేసి తిట్టాడా? అసలు ఏమైంది?

Published: 08-05-2026, 8:15 PM
జగపతి బాబుకు ఊహించని షాక్! ఆ సినిమా చేసినందుకు అభిమాని ఫోన్ చేసి తిట్టాడా? అసలు ఏమైంది?
  • జగపతి బాబు కెరీర్‌లో కష్టకాలంలో ‘ఆరు’ సినిమా చేశారు.
  • కాకినాడ నుంచి అభిమాని ఫోన్ చేసి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • “ఏంట్రా ఆరా, రేపు ఏడు తీస్తావా?” అంటూ నిలదీసిన ఫ్యాన్.
  • డబ్బుల కోసమే చేశానని జగపతి బాబు ఒప్పుకున్న నిజం వైరల్.

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి సంచలన వార్త బయటపడింది. ఆయన కెరీర్‌లో ఓ సినిమా చేసినందుకు అభిమాని నుంచి ఊహించని తిట్లు ఎదుర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి కథనం మీకోసం!

జగపతి బాబుకు ఊహించని షాక్!

Jagapathi Babu : జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గతంలో హీరోగా స్టార్ డమ్ చూసిన జగపతి బాబు మధ్యలో ఫ్లాప్స్ రావడం, డబ్బులు పోవడంతో కొన్ని సిన్మాలు నచ్చకపోయినా కేవలం డబ్బుల కోసమే చేయాల్సి వచ్చింది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు అలా చేసిన ఓ సినిమా గురించి చెప్తూ ఆ సినిమా చేసినందుకు ఫ్యాన్ ఫోన్ చేసి మరీ తిట్టిన విషయాన్ని తెలిపాడు.

‘ఆరు’ సినిమాపై అభిమాని ఆగ్రహం!

జగపతి బాబు మాట్లాడుతూ.. ‘ఆరు’ అనే ఒక సినిమా చేశాను. నేను వరస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం చేశాను ఆ సినిమా. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నాను. నాకు కాకినాడలో ఓ పెద్ద ఫ్యాన్ ఉన్నాడు. వాడు ఆ ఆరు సినిమా రిలీజయ్యాక చూసి నాకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి ఏంట్రా ఆరా, రేపు ఏడు, ఐదు అని తీస్తావా? నీకు తిండి లేకపోతే చెప్పు మా ఇంటికి రా నేను పెడతాను కానీ ఇలాంటి ఎదవ సినిమాలు చేయకు అని తిట్టినట్టు తెలిపారు. దీంతో జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

డబ్బుల కోసమే చేశానన్న జగపతి బాబు!

జగపతి బాబు హీరోగా శ్రీకాంత్ లింగద్ దర్శకత్వంలో ఆరు అనే సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 2012 లో ఈ సినిమా రిలీజయి ఫ్లాప్ గా నిలిచింది.

జగపతి బాబుకు ఎదురైన ఈ అనుభవం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి సంచలన విషయాలు ఇంకెన్ని ఉన్నాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్, వైరల్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.