
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారిన తరుణ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది. దానికి నెటిజన్ల ప్రతిచర్యలు ఆసక్తికరం.
Key Points
తరుణ్ తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
అమెరికా వెకేషన్‌లో డాన్ లీని కలిశాడు.
తెల్ల గడ్డంతో కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అభిమానులు మళ్ళీ సినిమాలు చేయమని కోరుకుంటున్నారు.
తరుణ్‌కు అమెరికా వెకేషన్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి హిట్ సినిమాలను అందించిన హీరో తరుణ్(Tharun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అప్పట్లో చేసిన దాదాపు అన్ని సినిమాలు క్లాసికల్ హిట్స్ అనే చెప్పాలి. ఇక ఇతని మూవీలోని సాంగ్స్‌కి అయితే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన తరుణ్ (Tharun) సుమారు దశాబ్దంగా సినిమాల్లో కనిపించడం పూర్తిగా బంద్ చేశారు. కానీ తరుచూ ఎక్కడో అక్కడ వార్తల్లో వినిపిస్తూ, కనిపిస్తూ తన అభిమానులను పలకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తరుణ్ సోషల్ మీడియా(Social Media)లో పెట్టిన ఫొటోతో మరోసారి ట్రెండింగ్‌గా మారాడు.
ఇటీవల అమెరికా (USA) వెకేషన్‌కు వెళ్లిన మన టాలీవుడ్ హీరో లాస్ వేగాస్ (Las Vegas)లో సౌత్ కొరియా (South Korea) అగ్ర నటుడు డాన్ లీ (DonLee)ని కలిసి ఆయనతో ఫొటో దిగారు. ఆ చిత్రం కాస్త సామాజిక మాద్యమాల్లోకి చేరి ఇప్పుడుపెద్ద రచ్చే చేస్తుంది. ఆ ఫొటో చూసిన వాళ్లంతా అప్పట్లో చాలా క్యూట్‌గా ఉండే తరుణ్ ఇప్పుడు కొంచెం తెల్ల గడ్డంతో ఏజెడ్ పర్సన్‌లా కనిపించేసరికి షాక్ అవుతున్నారు. అలాగే మీరు మళ్లీ సినిమాలు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తరుణ్ ఫొటోను ఓ సారి చూసేయండి. Link
డాన్ లీతో ఫోటో
నెటిజన్ల ప్రతిచర్య
తరుణ్ తన తాజా ఫోటోతో మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిమానుల కోరిక మేరకు త్వరలోనే తెరకు తెరపై కనిపించాలని ఆశిద్దాం.


