|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Published: 11-06-2025, 12:17 AM
రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

టాలీవుడ్ నటి ఇషికా దత్త రెండోసారి తల్లి అయ్యారు. నితిన్ హీరోగా నటించిన ‘చాణక్యుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషికా, తన కూతురు జనన వార్తను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వత్సల్ సేథ్ తో ఆమె వివాహం జరిగింది.

Key Points

1

టాలీవుడ్ నటి ఇషికా దత్త రెండోసారి తల్లి అయ్యారు.

2

ఈ జంటకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు.

4

నెటిజన్లు ఇషికా దత్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇషికా దత్త రెండో బిడ్డకు జన్మనిచ్చారు

హీరోయిన్ ఇషికా దత్త(Ishika Datha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో నితిన్(Nithin) హీరోగా నటించిన ‘చాణక్యుడు’(Chanakyudu) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అనుకున్నంతగా స్టార్‌డమ్ తెచ్చకోలేక పోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అక్కడ పలు సీరియల్స్ కూడా యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వత్సల్ సేథ్‌(Vathsal Seth)ను మ్యారేజ్ చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ జంటకు ఓ కుమారుడు ఉండగా.. తాజాగా మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది’ అని రాసుకొస్తూ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా ఈ జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

నెటిజన్ల నుండి శుభాకాంక్షలు

A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

ఇషికా దత్త రెండవ బిడ్డ జననం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఆమెకు, ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.