|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అతన్ని ప్రేమించి లైఫ్‌లో పెద్ద తప్పు చేశాను.. టాలీవుడ్ హీరోయిన్ అనితా హస్సానందని సంచలన కామెంట్స్

Published: 09-07-2025, 2:23 AM
అతన్ని ప్రేమించి లైఫ్‌లో పెద్ద తప్పు చేశాను.. టాలీవుడ్ హీరోయిన్ అనితా హస్సానందని సంచలన కామెంట్స్

‘నువ్వు నేను’ సినిమాతో పరిచయమైన టాలీవుడ్ నటి అనితా హస్సానందని తన గత ప్రేమ సంబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

అనితా హస్సానందని తన గత ప్రేమ సంబంధం గురించి సంచలన విషయాలు వెల్లడించింది.

2

మత భేదాల వల్ల ఆమె ప్రేమ విఫలమైందని తెలిపింది.

4

ప్రస్తుతం ఆమె సంతోషంగా ఉందని తెలిపింది.

అనితా హస్సానందని గత ప్రేమ విషయం

దివంగత హీరో ఉదయ్ కిరణ్(Uaday Kiran) నటించిన ‘నువ్వు నేను’(Nuvvu Nenu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనితా హస్సానందని(Anitha Hassanandani) మనందరికీ సుపరిచితమే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో పత్తా లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు ఎప్పుడు ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.

మత భేదాల ప్రభావం

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పెళ్లికి ముందు జరిగిన బ్రేకప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. “ గతంలో నేను ఈజాజ్‌తో రిలేషన్‌లో ఉన్నాను. మా అమ్మకు ఇష్టం లేకున్నా నేను అతన్ని ప్రేమించాను. అయితే మా మదర్ అతన్ని వద్దు అనడానికి కారణం అతను వేరే మతానికి చెందినవాడు. ఇక అతను నన్ను ఎప్పుడూ నువ్వు నాకు వొద్దు అని డైరెక్ట్‌గా చెప్పలేడు. కానీ ఎప్పుడూ ఇన్‌డైరెక్ట్‌గా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. దీనివల్ల మా సంబంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు.

బ్రేకప్ తర్వాత జీవితం

ఎందుకంటే అప్పుడు నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను. నేను ప్రేమించిన వ్యక్తి కోసం పూర్తిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక అతనితో బ్రేకప్ అయిన టైంలో నేను చాలా ఒంటరిగా ఫీలయ్యాను. అలా వాటన్నింటినీ అధిగమించడానికి నాకు ఏడాది పట్టింది. కానీ ప్రజెంట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా బ్రేకప్ తర్వాత ఈ చిన్నది 14 అక్టోబర్ 2013న గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఆరవ్ అనే బాబు కూడా ఉన్నాడు.

అనితా హస్సానందని తన గత సంబంధం గురించి తెలిపిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ప్రస్తుత జీవితంలో సంతోషంగా ఉందని తెలుపుతూ తన అనుభవాలను పంచుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.