
థియేటర్ సమస్యలు, టికెట్ ధరల పెంపు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ చూపిన ఆందోళనతో, టాలీవుడ్ ప్రముఖులు జూన్ 15న ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తూన్నారు. ఈ కీలక భేటీలో పలు ముఖ్యమైన అంశాలు చర్చించబడనున్నాయి.
Key Points
జూన్ 15న సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భేటీ నిర్వహణ.
థియేటర్ సమస్యలు, టికెట్ ధరలు, ఫుడ్ ధరలు ప్రధాన చర్చాంశాలు.
ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డులు కూడా చర్చించే అవకాశం.
టాలీవుడ్ ప్రముఖుల సీఎం భేటీ
Tollywood : గత కొన్ని రోజులుగా థియేటర్స్ ఇష్యూ, జనాలు థియేటర్స్ కి రావట్లేదు, థియేటర్స్ బంద్, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో ఫుడ్ రేట్లు, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అవ్వడంతో ఈ అంశాలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజూ ఎవరో ఒకరు నిర్మాతో, థియేటర్ ఓనర్స్ వీటిపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ సీరియస్ అయి అసలు ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంని కలిసారా అని ప్రశ్నించడం, ఇక నుంచి ఏం ఉన్నా టాలీవుడ్ కి ప్రభుత్వానికి మధ్య ఫిలిం ఛాంబర్ ఉండాలని చెప్పడంతో టాలీవుడ్ లో వీటిపై చాలానే చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ నెల జూన్ 15న ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సా.4 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. పవన్ సీరియస్ అయిన తర్వాత సినీ ప్రముఖులు ఏపీ సీఎంని పవన్ కళ్యాణ్ తో సహా కలవడం ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ పాత్ర
చర్చించే అంశాలు
ఈ మీటింగ్ లో థియేటర్స్ సమస్యలు, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లు, ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డులు.. ఈ అంశాలన్నీ ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం. ఈ భేటీకి టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతలు, పలువురు దర్శకులు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
ఈ భేటీ ఫలితంగా టాలీవుడ్ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం సహకారంతో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు.

