|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దయచేసి నన్ను క్షమించండి.. ఇంకోసారి తప్పు చేయనంటూ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published: 06-07-2025, 9:55 AM
దయచేసి నన్ను క్షమించండి.. ఇంకోసారి తప్పు చేయనంటూ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ‘కలర్ ఫోటో’ చిత్రంతో పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్‌లోని వివాదాస్పద డైలాగ్స్ గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Key Points

1

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తన వెబ్ సిరీస్ 'ఆల్ ఇండియా ర్యాంకర్స్'లోని వివాదాస్పద డైలాగ్స్ గురించి క్షమాపణ చెప్పారు.

2

సిరీస్‌లోని ఒక డిజాస్టర్ సన్నివేశాన్ని తొలగించినట్లు తెలిపారు.

4

ప్రేక్షకుల ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

సందీప్ రాజ్ క్షమాపణ

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ‘కలర్ ఫొటో’చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల సందీప్ రాజ్ ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ (All India Rankers) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని డైలాగ్స్ వివాదాస్పదమయ్యాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, సందీప్ రాజ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘డియర్స్ బ్రదర్స్ ఈ ఏడాదిని గొప్పగా ప్రారంభించాను. బ్లాక్ బస్టర్ చిత్రం ‘డాకు మహారాజ్’లో భాగం కావడం సంతోషంగా అనిపించింది. ట్వీట్ల ద్వారా నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడి పని చేయడానికి నాకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు అదే అకౌంట్స్ నుండి, అదే వ్యక్తుల నుండి ద్వేషాన్ని చూడటం ఖచ్చితంగా నా హృదయాన్ని కలచివేస్తోంది. జనవరిలో నేను నిజంగా ఆ అభినందనలకు అర్హుడనా? అంటే.. తెలియదు. జూలైలో నేను నిజంగా ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే.. స్పష్టంగా అవుననే అంటాను. నేను విషయాలను కప్పిపుచ్చడానికో, మేము చేసిన దానికి మద్దతు ఇవ్వడానికో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు.

‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వివాదం

ఒక ఫిలిం మేకర్ గా నేను ‘ఆడియన్స్ ఎల్లప్పుడూ రైటే’ అని ఒకే ఒక స్లోగన్‌ను మాత్రమే నమ్ముతాను. ఆ నిర్దిష్ట కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే, దానిలో భాగమైనందుకు నేను చాలా చింతిస్తున్నాను. మాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదు. లక్ష్యంగా చేసుకోలేదు.. నిర్దిష్టమైన సామాజిక వర్గాన్ని కానీ, లేదా ఏదైనా మతాన్ని గానీ టార్గెట్ చేయాలని అనుకోలేదు. మేము ఒక డిజాస్టర్ సన్నివేశాన్ని తొలగించాము. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ దశలలో తప్పులు చేస్తారు. మేము అదే చేసాము. దానిని వెంటనే సరిదిద్దుకున్నాము. మళ్ళీ అలాంటి తప్పు చేసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. AIR అనేది అనేక మంది యంగ్ ప్రతిభావంతులు కలిసి ఎంతో ప్యాషన్‌తో రూపొందించబడింది.

భవిష్యత్తు ప్రణాళికలు

డ్రామా, ఎమోషన్స్, ఫ్రెష్ నెస్ కోసం ఈ సిరీస్ ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఈ బ్యాడ్ లైట్ లోకి నెట్టివేసిన ఒక బ్యాడ్ సీన్‌తో గుర్తుండిపోవాలని కోరుకోవడం లేదు. ఇప్పటి నుండి ఏదైనా కంటెంట్‌ను తయారు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకోసారి తప్పు చేయను. ఈ బ్యూటిఫుల్ వీకెండ్‌లో మీ మనస్సులను బాధ పెట్టినందుకు దయచేసి నన్ను క్షమించండి. నాపై, నా టీం మీ కోపాన్ని చల్లార్చడానికి బ్యూటిఫుల్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. ‘ఈసారికి వదిలేయి అన్నా… నిన్ను నొప్పించాలి అని చేయలేదు’ అని AIR టీం తరపున మిమ్మల్ని కౌగిలించుకుని చెప్పాలనుకుంటున్నాను. థాంక్యూ’’ అని రాసుకొచ్చారు.

ఈ ఘటనతో సందీప్ రాజ్ తన తప్పును ఒప్పుకొని, భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. ప్రేక్షకుల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.