
📌 Key Points
- చైతూ ‘వృషకర్మ’ హక్కులు భారీ ధరకు కొనుగోలు చేసిన నాగవంశీ!
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక హక్కులు ఏకంగా 45 కోట్లకు దక్కించుకున్న నిర్మాత.
- కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!
- దేవర, వార్ 2 సినిమాల తర్వాత నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ లో మరో సాహసం!
టాలీవుడ్ లో సంచలనం! యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా కోసం నిర్మాత నాగవంశీ ఏకంగా 45 కోట్లు రిస్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
45 కోట్లతో నాగవంశీ భారీ డీల్!
చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే నిర్మాతలు ఎక్కువ శాతం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేవారు కాదు. పెద్ద నిర్మాతలకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు, వారు ఏదైనా సినిమాను నిర్మిస్తే ఎక్కువ, తక్కువ తేడాలతో ఒక ఏరియాకు ఒకరిని ఎంచుకొని వారికి హక్కులను ఇచ్చేవారు, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయికి చేరుకున్న వారు ఎంతోమంది డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అందులో నాగ వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు.
చైతూ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈయన కేవలం సినిమాలను ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఈ నిర్మాత ‘దేవర పార్ట్ 1’, ‘వార్ 2’ లను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇందులో దేవర ద్వారా ఈయనకు లాభాలు వచ్చిన వార్ 2 ద్వారా మాత్రం లాభాలు రాలేదని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నిర్మాత మరో సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
డిస్ట్రిబ్యూషన్ లో నాగవంశీ సాహసం!
నాగ వంశీ, నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక హక్కులను 45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దానితో నాగ వంశీ పెద్ద రిస్క్ చేస్తున్నాడు, టాక్ ఏ మాత్రం తేడా కొట్టిన ఆయనకు నష్టాలు వస్తాయి అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరి కొంతమంది మాత్రం ఆయన సినిమా గురించి అన్నీ తెలుసుకునే అంత ధరకు కొనుగోలు చేసి ఉంటాడు. కచ్చితంగా ఆ మూవీతో పెద్ద మొత్తంలో లాభాలను అందుకుంటాడు అని అంచనా వేస్తున్నారు.
నాగవంశీ ‘వృషకర్మ’ సినిమా పంపిణీ హక్కులు కొనుగోలు చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


