
తెలుగు సినిమా రంగంలో విజయవంతమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, IIT ఢిల్లీ నుండి సైన్స్ పరిశోధనను వదులుకొని సినిమాల వైపు మళ్ళిన ఆసక్తికరమైన కథ ఇది. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకుందాం.
Key Points
IIT ఢిల్లీలో PhD చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల సినిమా రంగం వైపు మళ్ళారు.
సైంటిస్ట్ కావాలనుకున్న ఆయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో పేరు తెచ్చుకున్నారు.
మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులకు ఆయన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఇటీవల 'పెదకాపు' సినిమాతో నిరాశపరిచినా, ఆయన ప్రయాణం ఆసక్తికరంగా ఉంది.
సైంటిస్ట్ నుంచి సినిమా దర్శకుడు
Tollywood Director : సినిమాల్లోకి వచ్చేవాళ్ళు చాలా మంది వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చినవాళ్లే ఉంటారు. వేరే ఫీల్డ్స్ లో సక్సెస్ అయినవాళ్లు కూడా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్, సుకుమార్, శైలేష్ కొలను.. ఇలా చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళ ఫీల్డ్స్ లో సక్సెస్ అయి సినిమాల్లోకి వచ్చారు. అదే లిస్ట్ లో మరో డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఈ డైరెక్టర్ ఏకంగా సైంటిస్ట్ అవ్వాల్సిన వాడు సినిమాల్లోకి వచ్చాడు.
శ్రీకాంత్ అడ్డాల విజయాల ప్రయాణం
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా? మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఇటీవల పెదకాపు అనే సినిమాతో వచ్చి నిరాశపరిచారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విశేషాలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి, తాను ఏమవ్వాలనుకున్న దాని గురించి తెలిపాడు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. నేను ఢిల్లీ IIT లో PHD చేస్తున్నప్పుడు మధ్యలో వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో జర్మనీ లేదా న్యూజిలాండ్ వెళ్లి సైంటిస్ట్ అవ్వాలని ఉండేది. అట్మాస్ఫియర్ ఫిజిక్స్ లో న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మీద PHD చేసేవాడ్ని దాన్ని మధ్యలో వదిలేసి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు అని తెలిపాడు.
శ్రీకాంత్ అడ్డాల తన వినూత్నమైన ప్రయాణంతో తెలుగు సినిమా రంగానికి కొత్త అంశాలను అందించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలతో ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.


