|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tollywood Film Workers Strike: చిరంజీవి ముందుకు టాలీవుడ్‌ పంచాయితీ

Published: 18-08-2025, 9:15 AM
Tollywood Film Workers Strike: చిరంజీవి ముందుకు టాలీవుడ్‌ పంచాయితీ

వేతనాల పెంపు కోసం టాలీవుడ్ సినిమా కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిరంజీవి ముందుకు వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

Key Points

1

టాలీవుడ్ సినిమా కార్మికుల సమ్మె 14 రోజులుగా కొనసాగుతోంది.

2

వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మికుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

4

ఫిలిం ఛాంబర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్మాతలు తెలిపారు.

సినిమా కార్మికుల సమ్మె కొనసాగుతోంది

సాక్షి, హైదరాబాద్‌: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె ( Tollywood Film Worker Strikes ) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్‌తో భేటీ ఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలు చిరంజీవి ( Chiranjeevi Konidela )ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్‌ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు.

వేతనాల పెంపుపై విభేదాలు

త్వరలోనే పరిష్కారం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కే అప్పగించారు. ఛాంబర్‌ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.

చిరంజీవి జోక్యం

చిరంజీవి జోక్యంతో టాలీవుడ్ సమ్మె త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.