
📌 Key Points
- ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన శివాజీ, రియల్ ఎస్టేట్ లో వేల కోట్లు నష్టపోయాడు.
- `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` చిత్రంతో రీసెంట్‌గా శివాజీ రీఎంట్రీ ఇచ్చాడు.
- కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 18 ఎకరాల భూమి కొని అమ్మేయడంతో భారీగా నష్టం వాటిల్లింది.
- తాజాగా `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీకి నిరాశే ఎదురైంది.
టాలీవుడ్‌లో ఒక సంచలనం! ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన నటుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా వేల కోట్లు నష్టపోయాడు. ఆ హీరో ఎవరో తెలుసా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!
రియల్ ఎస్టేట్‌తో దెబ్బతిన్న కెరీర్!
సినిమాల్లో ఒక్కసారి రాణిస్తే, క్లిక్ అయితే పారితోషికం రూపంలో గట్టిగానే వస్తుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు రెమ్యూనరేషన్స్ రూపంలో వందల కోట్లు సంపాదిస్తుంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన తెలుగు నటుడు తన చిన్న పొరపాటు కారణంగా వేల కోట్లు నష్టపోయాడు. రియల్ ఎస్టేట్ చేద్దామని ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డాడు. సుమారు రెండు వేల కోట్ల వరకు నష్టపోయాడు. మరి ఆ హీరో ఎవరు? ఎంత నష్టపోయాడనేది చూస్తే.
ఆ హీరో ఎవరో కాదు శివాజీ. ఇటీవల ఆయన `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్` చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత `కోర్ట్` మూవీ ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ కి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో మంగపతి పాత్రలో ఇరగదీశాడు. వాహ్ అనిపించాడు. ఆ తర్వాత `దండోరా` చిత్రంతో అందరి హృదయాలను కదిలించాడు. కానీ ఇటీవల పెద్ద డిజాస్టర్ అందుకున్నారు.
శివాజీ చేసిన ఆ ఒక్క తప్పేమిటి?
శివాజీ మెయిన్ లీడ్‌గా ఇటీవల `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` అనే చిత్రం రూపొందింది. దీనికి తనే నిర్మాత. లయ ఆయనకు జోడీగా చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీ ఓటీటీ కోసం రూపొందించారు. కానీ థియేటర్లో విడుదల చేశారు. థియేటర్లో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ దెబ్బకి ఇంకా ఓటీటీలోకి కూడా రాలేదు. ఇప్పుడు మళ్లీ సెలక్టీవ్‌గా వెళ్తోన్న ఆయన ఇటీవల చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను వేల కోట్లు నష్టపోయిన విషయాన్ని వెల్లడించారు.
శివాజీ ఒకప్పుడు హీరోగా రాణించారు. కామెడీ హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. చిరంజీవి, బాలయ్య వంటి టాప్ హీరోల తర్వాత కామెడీ చిత్రాలతో టైర్ 2 హీరోల్లో ఒకరిగా రాణించారు. కెరీర్ బాగున్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్లాడు. అక్కడ సక్సెస్ కాలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అయితే సినిమాల్లోకి రాలేని పరిస్థితుల్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పొరపాటు చేశారు. దీంతో వేల కోట్లు కోల్పోయాడు.
మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ!
హీరోగా పీక్‌లో ఉన్నప్పుడు కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 18ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడట శివాజీ. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాన్ని అమ్మేశారు. మరో చోట ఇన్వెస్ట్ చేశాడట. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే కోకాపేటలో ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది. ఇప్పుడు ఒక్కో ఎకరం వంద కోట్లకుపైగా పలుకుతోంది. కొన్ని కోట్ల 150కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆ మధ్య ప్రభుత్వం ల్యాండ్ అమ్మితే వంద కోట్లకుపైగా పలికింది. ఇప్పుడు ఆ రేట్లు ఇంకా పెరిగాయి. దీంతో శివాజీ ఏకంగా రూ.1800కోట్ల నుంచి 2 వేల కోట్లకుపైగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. ఆ మనీ రొటేషన్ చేసినా ఇప్పుడు వాటి వ్యాల్యూ పది శాతానికి అటుఇటుగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా శివాజీ చేసిన మిస్టేక్ పెద్ద దెబ్బ కొట్టింది. వేల కోట్లకు అధిపతి అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం మళ్లీ నటుడిగా స్ట్రగుల్ అవుతున్నాడు శివాజీ. విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. కొత్తగా ఆయన మరే మూవీని ప్రకటించలేదు.
శివాజీ జీవితంలో జరిగిన ఈ సంఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది కదూ? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మళ్ళీ కలుద్దాం!


