
టాలీవుడ్‌లో సత్తా చాటుతున్న నటి కీర్తి సురేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని విజయ్ పార్టీతో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది.
Key Points
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా?
విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం.
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కీర్తి సురేష్ రాజకీయ ప్రవేశం?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయి.. పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. తెలుగు, తమిళ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్నారు కీర్తి సురేష్.
విజయ్ పార్టీతో సంబంధం?
నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు కీర్తి సురేష్. ఇక ఇటీవల బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి… అందర్నీ ఆకట్టుకున్నారు.
ఎన్నికల ప్రభావం?
అయితే అలాంటి హీరోయిన్ కీర్తి సురేష్.. రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన హీరో విజయ్ పెట్టిన పార్టీ లోకి వెళ్తారని సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కంటే ముందు ఆ పార్టీలోకి కీర్తి సురేష్ వెళతారని ప్రచారం సాగుతోంది. లేదా విజయ్ కోసం ప్రచారం అయిన కీర్తి సురేష్ చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ వార్త కేవలం ప్రచారమే అయినప్పటికీ, కీర్తి సురేష్ రాజకీయ ప్రవేశం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.


