
📌 Key Points
- ఎస్పీ వెంకటేష్ 70 ఏళ్ల వయసులో మరణించారు.
- ఆయన తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.
- ఫిలింఫేర్, కేరళ స్టేట్ అవార్డులను ఆయన అందుకున్నారు.
- చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేష్ మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఎస్పీ వెంకటేష్ మరణం: సినీ పరిశ్రమలో విషాదం
Tollywood:చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిస్తే.. మరి కొంతమంది వయసు మీద పడడంతో స్వర్గస్తులవుతున్నారు. ఇంకొంతమంది పలు కారణాలవల్ల చనిపోతున్నా.. వారి మరణానికి గల కారణాలు మాత్రం తెలియక అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు, మలయాళం, తమిళ్ , హిందీ , బెంగాలీ భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించి , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా.. ఫిలింఫేర్ , కేరళ స్టేట్ అవార్డులను దక్కించుకున్న దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేష్ (SP.Venkatesh) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. లెజెండ్రి మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూయడంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈయనతో కలిసి పని చేసిన ఎంతోమంది హీరోలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మరణానికి దిగ్బ్రాంతి తెలియజేస్తున్నారు.
ఎస్పీ వెంకటేష్ మంగళవారం నాడు 70 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. చెన్నైలోనే ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు మాత్రం వారు వెల్లడించలేదు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
ఎస్పీ వెంకటేష్ సినీ ప్రస్థానం
ప్రముఖ సంగీత దర్శకుడు విజయ భాస్కర్ తో కలసి గిటారిస్టుగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన వెంకటేష్.. 1975లో కన్నడ చిత్రాలలో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసి4స్థిరపడ్డారు. ఇక 1981లో తెలుగు చిత్రమైన ‘ప్రేమ యుద్ధం’ అనే సినిమాతోనే మొదటిసారి సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి.. మంచి పేరు అందుకున్నారు. ఇకపోతే మలయాళ సినిమాలలో వెంకటేష్.. రాఘవన్ మాస్టర్ వంటి స్వరకర్తలతో సహాయ సంగీత దర్శకుడిగా పని చేసి.. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన టిపి బాలగోపాలన్ ఎం ఏ చిత్రానికి నేపద్య సంగీత సహాయకుడిగా కూడా పనిచేశారు.. ఆ తర్వాత మలయాళ చిత్రాలలోనే సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయారు. ఇక ఈయన దర్శకత్వం వహించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపును అందించాయి.
ఇకపోతే మలయాళంలోనే సంగీత దర్శకుడిగా స్థిరపడిపోయిన ఆయన 1990 దశకంలో ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించారు. రాజావింటే మకన్, అప్పు, దౌత్యం, విలంబరం , మహాయనం, వ్యూహం ఇలా ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును అందించాయి. ఏదేమైనా ఇలా మలయాళం సినీ పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఎస్పీ వెంకటేష్ తుదిశ్వాస విడవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఎస్పీ వెంకటేష్ మరణానికి కారణాలు వెల్లడి కాలేదు
ఎస్పీ వెంకటేష్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.


