
త్రినాధ్ కటారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఐఎంవై సినిమా ప్రమోషన్లో భాగంగా ఆకర్షణీయమైన కాంటెస్ట్ ప్రకటించారు. సినిమా టైటిల్ చెప్పి లక్ష రూపాయలు గెలవండి!
Key Points
సినిమా టైటిల్ చెప్పి లక్ష రూపాయలు గెలవండి!
టాప్ 10 క్రియేటివ్ టైటిల్స్ కి రూ. 5000!
నవంబర్ 13 వ తేదీ లోపు మీ సమాధానాన్ని పంపండి!
లక్ష రూపాయల బహుమతి!
సినిమా పేరు చెప్పండి .. లక్ష రూపాయలు మీకే . ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా ? అని అనుకుంటున్నారా ? అవునండి మీరు విన్నది నిజమే .. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి . ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ చదివేయండి .
త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు . ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు . ఈ పాట ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది . ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా .. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు .
ఐఎంవై సినిమా ప్రమోషన్
అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ ను మేకర్స్ ప్రారంభించారు . ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్ గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు . అంతేకాకుండా టాప్ -10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ .5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు . ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్ కు వాట్సాప్ చేసేయండి . ఇంకెందుకు ఆలస్యం .. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి .
ఎలా పాల్గొనాలి?
కాగా .. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్ లో కె శంకర్ నిర్మించారు . ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు . ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు .
మీ క్రియేటివిటీని ప్రదర్శించి లక్ష రూపాయలు గెలుచుకోండి! నవంబర్ 13 తేదీ ముగింపు తేదీ కాబట్టి వెంటనే పాల్గొనండి.


