|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్‌లో 2000 కోట్ల నష్టం! రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరు సినిమాలకి ఏమైంది?

Published: 12-04-2026, 11:05 PM
షాకింగ్: టాలీవుడ్‌లో 2000 కోట్ల నష్టం! రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరు సినిమాలకి ఏమైంది?
  • రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల మరింత ఆలస్యం, అభిమానుల్లో నిరాశ!
  • ప్రభాస్ ‘ఫౌజీ’ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్‌కు వాయిదా!
  • చిరంజీవి ‘విశ్వంభర’ గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం, విడుదలపై సందిగ్ధత!
  • నాని ‘ప్యారడైజ్’ విడుదల ఆగస్టుకు వాయిదా, బడ్జెట్ సమస్యలే కారణమా?

టాలీవుడ్ సినిమా లవర్స్ కి బిగ్ షాక్! రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల వాయిదా పడుతూ వస్తున్నాయి. దీని వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చదవండి!

రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల ఆలస్యం!

ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ చిత్రాలు ప్రమాదంలో పడుతున్నాయి. వరుసగా వాయిదాలు పడుతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాంచరణ్, చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అగ్ర హీరోలు నటిస్తున్న చిత్రాలని నిర్మాతలు వాయిదా వేస్తున్నారు. అసలైన కారణాలు మాత్రం అభిమానులకు అంతు చిక్కడం లేదు. వాయిదాలు పడుతూ అభిమానులని కలవర పెడుతున్న చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో రాంచరణ్ అభిమానుల ఆశలన్నీ ప్రస్తుతం పెద్దిపైనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి పెద్ది థియేటర్స్ లో సందడి చేసేది. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కూడా కష్టమే అంటూ ప్రచారం జరుగుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వల్లే డిలే అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. వాయిదా పడే కొద్దీ నిర్మాతకు ఇబ్బందులు తప్పవు.

ప్రభాస్ ‘ఫౌజీ’కి భారీ బడ్జెట్ ఇబ్బందులు!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఊర మాస్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా మార్చిలోనే రిలీజ్ కావలసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టు కి వాయిదా పడింది. బడ్జెట్ కారణాలు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ టైం పీరియడ్ నేపథ్యంలో వార్ యాక్షన్ డ్రామాగా హను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బడ్జెట్ 600 కోట్లు. ప్రభాస్ సినిమా కాబట్టి బడ్జెట్ సమస్య ఉండదు. హిట్ అయితే ఎంత పెట్టినా రికవరీ అవుతుంది. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడుతుండడం అభిమానులని కలవరపెడుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ కు వాయిదా పడ్డట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

చిరంజీవి ‘విశ్వంభర’ ఎప్పుడు రిలీజో?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంపై మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఇప్పటికే ఏళ్ల తరబడి ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై ట్రోలింగ్ మొదలైంది. ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వల్ల పలు మార్లు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఇప్పటికీ లేదు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా చాలా భాగం మిగిలి ఉండడంతో ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడితే నిర్మాతలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఈ సినిమాల విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.