|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ సంక్షోభం: జెట్లీ సినిమాకు బ్రేకులు.. పర్సంటేజీ వార్ వెనుక అసలు నిజం!

Published: 01-05-2026, 11:18 AM
టాలీవుడ్ సంక్షోభం: జెట్లీ సినిమాకు బ్రేకులు.. పర్సంటేజీ వార్ వెనుక అసలు నిజం!
  • నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రెంటల్, పర్సంటేజీ విధానాలపై తీవ్ర వివాదం.
  • ‘జెట్లీ’ సినిమా విడుదలకు అడ్డంకులు, ప్రధాన థియేటర్లలో షోలు రద్దు.
  • దిల్ రాజు, ఏసియన్, సురేష్ బాబు వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల థియేటర్లలో రిలీజ్ కాలేదు.
  • ప్రొడ్యూసర్స్ గిల్డ్ రెంటల్ సిస్టమ్‌ను సమర్థిస్తుండగా, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ డిమాండ్.

టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ వాటాపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ గొడవ కారణంగా ‘జెట్లీ’ సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. రెంటల్ సిస్టమ్ కావాలంటున్న నిర్మాతలు, పర్సంటేజీ వాటా కోరుతున్న ఎగ్జిబిటర్ల మధ్య అసలు ఏం జరుగుతుందో చూద్దాం.

రెంటల్ వర్సెస్ పర్సంటేజీ: అసలు వివాదం ఏంటి?

Theatre Dispute : హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో మరొకరు బలైనట్టు ‘రెంటల్’ వర్సెస్ ‘పర్సంటేజీ’ పంచాయితీ ఇపుడు జెట్లీ మెడకి చుట్టుకుంది. అవును… గత కొంతకాలంగా ఈ రెండు సిస్టమ్స్ మధ్య జరుగుతున్న గొడవ చిలికి చిలికి ఈరోజే థియేటర్లకి వచ్చిన జెట్లీ సినిమా షోలు ఆగిపోయేదాకా వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో జరుగుతున్న ‘రెంటల్’ వర్సెస్ ‘పర్సంటేజీ’ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయి కూర్చుంది.

విషయంలోకి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్ల (థియేటర్ల యాజమాన్యాలు) మధ్యలో ఈ పర్సంటేజీ పంచాయితీ నడుస్తున్న సంగతి తెల్సిందే. మాకు రెంటల్ సిస్టమ్ లో అస్సలు గిట్టుబాటు అవ్వట్లేదు, గతంలో మాదిరి అంటే సినిమాకి వచ్చే కలెక్షన్లని బట్టి పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని నడిపిస్తామని గతంలోనే డిమాండ్ చేశారు ఎగ్జిబిటర్లు.

ఇక కొన్ని రోజుల కిందట ఇదే విషయం పై ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇక నుండి వచ్చే కలెక్షన్స్ లో వాటా ఇవ్వాల్సిందే అంటూ సీరియస్ గా తేల్చి చెప్పారు కూడా. అయితే గిల్డ్ ప్రొడ్యూసర్స్ మాత్రం థియేటర్ల మెయింటెనెన్స్ భారీగా పెరిగిపోయిందని, ఈ దశలో గనుక కలెక్షన్లలో వాటా ఇస్తే వర్కౌట్ అవ్వదని ‘రెంటల్ సిస్టమ్’ (అద్దె ప్రాతిపదికన) ఉంటేనే ప్రొడ్యూసర్స్ కి కాస్తైనా మిగులుతుందంటూ వాదిస్తున్నారు.దీంతో ఇద్దరి మధ్యలో పంచాయితీ అలా అలా సాగుతూ ఎటూ తేలక ఇపుడు ముదిరి పాకాన పడింది.

జెట్లీ’ కి భారీ షాక్.. ఖాళీగా థియేటర్లు

‘జెట్లీ’ సినిమాకు షాక్: ఎందుకు ఆగిపోయింది?

అయితే ముదిరిన ఈ పంచాయితీ ఇపుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ రోజే రిలీజ్ అయిన జెట్లీ సినిమా మెడకి చుట్టుకుంది. గ్రాండ్ గా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని స్క్రీన్ లలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఇండస్ట్రీలో పాపులర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గా ముద్ర పడ్డ దిల్ రాజు (SVC), ఏసియన్, సురేష్ బాబు, గీతా ఆర్ట్స్ వారి కంట్రోల్ లో ఉన్న థియేటర్లలో మాత్రం సినిమా రిలీజ్ కాలేకపోయింది. అయితే ఈ పరిస్థితి కేవలం వీటికి మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్‌లో పాపులర్ మల్టీఫ్లెక్స్ అయినటువంటి AMB సినిమాస్, AAA మల్టీప్లెక్స్ వంటి టాప్ థియేటర్లలో కూడా జెట్లీ రిలీజ్ కాకపోవడంతో ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్ల మధ్య ఈ ‘పర్సంటేజీ’ పంచాయితీ ఏ స్థాయికి వెళ్లిందో అర్థమవుతుంది.

గిల్డ్ నిర్మాతల ఆగ్రహం.. ఎవరిది పైచేయి

ఇక సినిమా ఆగిపోవడంతో ఇష్యూ ఉంటె సరైన పరిష్కారం కోసం ప్రయతించాలని, అంతే కాని రిలీజ్ అయ్యే సినిమాల్ని ఇలా అడ్డుకోవడం ఏమీ బాగోలేదంటూ తెగ ఫైర్ అవుతున్నారు గిల్డ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటేనే ఎంతో మందికి అన్నం పెడుతుందని, ఇలా సినిమాలు రిలీజ్ అవకుండా చేస్తే చిన్న, పెద్ద సినిమాలు అన్నీ ఇబ్బందుల్లో పడతాయని వాపోతున్నారు.వీరిలా హెచ్చరిస్తున్నప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం వచ్చిన కలెక్షన్స్ లో వాటా ఇవ్వకపోతే సినిమాలు స్క్రీనింగ్ చేసేదేలే అంటూ కుండ బద్దలు కొట్టేస్తున్నారు. అయితే ఆంధ్రాలో ఈ వార్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ, తెలంగాణాలో మాత్రం గట్టిగానే కనిపిస్తుంది.

ఇండస్ట్రీలో హాట్ టాపిక్: గిల్డ్ నిర్మాతల వాదన

ప్రేక్షకుడి పరిస్థితి ఏంటి?

అయితే సినిమా రిలీజ్ అయిందా, పెద్ద స్క్రీన్ పైన చూశామా లేదా అన్నట్టుగా ఉండే మూవీ లవర్స్ మాత్రం ఈ ‘రెంటల్’ వర్సెస్ ‘పర్సంటేజీ’ వల్ల డిసప్పాయింట్ అయిపోతున్నారు.అసలే తెలుగు సినిమా ఈ మధ్య ప్యాన్ వరల్డ్ బాట పడుతుంది. అలాంటి ఈ సమయంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వ్యవస్థల్లో ఇలా యుద్ధం మొదలవడం అంటే అది తెలుగు సినిమా స్థాయిని కిందికి లాగడమే.

మరి ఇకనైనా రెండు వర్గాలు ఎక్కడో ఒకచోట ఈ పంచాయితీకి పుల్ స్టాప్ పెడతారా లేక ఇలాగే మంకు పట్టు పట్టి ఉన్న థియేటర్లని కాస్తా ఫంక్షన్ హాల్స్ గా మార్చేస్తారా కాలమే డిసైడ్ చేయాలి!

మొత్తంగా, టాలీవుడ్‌లో రెంటల్, పర్సంటేజీ వివాదం ‘జెట్లీ’ సినిమా విడుదలను అడ్డుకుంది. ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇండస్ట్రీ పెద్దలు తక్షణమే జోక్యం చేసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.