
📌 Key Points
- కాంతారావు చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి.
- విజయశాంతి ₹50,000, రామానాయుడు ₹20,000 ఆర్థిక సహాయం అందించినట్లు కాంతారావు కుమార్తె వెల్లడి.
- ఆసుపత్రి బిల్లులు సుమారు 7 నుండి 8 లక్షల రూపాయల వరకు అభిమానులే చెల్లించారు.
- జానపద హీరోగా కాంతారావుకు తెలుగు తెరకు అందించిన సేవలకు గుర్తుగా సహాయం.
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంతారావు గారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయనకు సహాయం చేసిన ఆ ఇద్దరు స్టార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాంతారావు సినీ జీవితం ఒక సంచలనం!
తెలుగు తెరపై జానపద సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హీరో కాంతారావు. ఒక వైపు పౌరాణిక పాత్రలతో N. T. Rama Rao దైవస్వరూపంగా నిలిచిన కాలంలో, మరోవైపు సాంఘిక చిత్రాలతో అక్కినేని నాగేశ్వరావు ప్రేక్షకాదరణ పొందుతున్న సమయంలో, జానపద హీరోగా.. అద్భుతమైన కథలతో సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కాంతారావు. కత్తి యుద్ధ సన్నివేశాలతో ప్రసిద్ధి చెందిన ఆయనను అభిమానులు ప్రేమగా “కత్తి కాంతారావు” అని ముంద్దుగా పిలుచుకునేవారు.
సినీ జీవితంలో శిఖరాగ్రాన నిలిచిన ఈ నటుడు చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఉన్న డబ్బు, ఆస్తి అంతా పోగోట్టుకున్నకాంతారావు చిన్న చిన్న పాత్రలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన కాంతారావు.. ఆతరువాత ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోని స్టేజ్ కు వెళ్లిపోయారు. ఆయన్ను ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆదుకోలేదు కానీ.. ఇద్దరు స్టార్స్ మాత్రం కాంతారావు హస్పిటల్ లో ఉన్నారని తెలిసి సాయం చేశారట. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్స్?
ఆర్థిక ఇబ్బందుల్లో కాంతారావు.. ఆదుకున్నది ఎవరు?
ఈ విషయాన్ని కాంతారావు కుమార్తే సుశీల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుశీల మాట్లాడుతూ, “సినిమాలు నిర్మించడం వల్ల నాన్నగారు ఆస్తులను కోల్పోయారు. కానీ ఆయన అసలైన ఆస్తి అభిమానులేనని నేను ప్రత్యక్షంగా చూశాను. నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఎంతోమంది అభిమానులు వచ్చి పరామర్శించేవారు. ఎవరూ పదివేలకు తక్కువ ఇవ్వలేదు. డబ్బులతో కూడిన కవర్లు అమ్మకి ఇచ్చి వెళ్లేవారు” అని తెలిపారు.
విజయశాంతి, రామానాయుడు చేసిన సహాయం!
ఆమె మాట్లాడుతూ, “నాన్నగారి ఆసుపత్రి బిల్లు సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు అయింది. ఆ మొత్తం మేమే చెల్లించాం. ఆ డబ్బంతా అభిమానులు ఇచ్చిందే. నాన్నగారు ఆసుపత్రిలో ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయితే ఇంటికి వచ్చి సహాయం చేసింది ఇద్దరే. విజయశాంతి గారు 50 వేలు, రామానాయుడు గారు 20 వేల వరకూ ఇచ్చారు. వారు తప్పించి.. ఇండస్ట్రీ నుంచి మిగతా ఎవరూ ఆదుకోలేదు. నాన్నగారు ఎప్పుడూ ఎవరిని వేషాలు ఇమ్మని కూడా అడగలేదు. అంతే కాదు చివరి రోజుల్లో కూడా ఎంత ఇబ్బంది ఉన్నా.. డబ్బు కోసం ఎవరినీ అడగలేదు” అని చెప్పారు.
కాంతారావు గారికి సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తుల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


